మీటూ తో ఇంకా చాలా మారాలంటోంది

0

కాస్టింగ్ కౌచ్.. మీటు ఈమద్య కాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఒకప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారిని వాడుకునే వారు.. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని అవసారాలు ఎరగా వేసి ఎంతో మందిని నిర్మాతలు.. దర్శకులు.. ప్రొడక్షన్ మేనేజర్స్ ఇలా ఎంతో మంది ఆడవారిని అంగడి బొమ్మగా చూసే వారు అంటూ మహిళలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో మీటూ వచ్చిన తర్వాత కాస్టింగ్ కౌచ్ ఆడవారిపై లైంగిక వేదింపులు తగ్గాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీటూ ఆరోపణల నేపథ్యంలో స్టార్స్ నుండి సామాన్యుల వరకు ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ప్రమాదమే అన్నట్లుగా ఆడవారిపై లైంగిక వేదింపులు చేసేందుకే భయపడుతున్నారు. మార్పు చాలానే వచ్చినా కియారా అద్వానీ మాత్రం ఇంకా మారాల్సింది చాలా ఉంది అన్నట్లుగా చెబుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీటూ గురించి మీ స్పందన ఏంటీ అంటే ఒకే ఒక్క మాటలో సమాధానం చెప్పింది.

మీటూ తర్వాత దశలోకి మనం ఇంకా వెళ్లలేదు అంది. అంటే ఇంకా కూడా అక్కడక్కడ లైంగిక వేదింపులు పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయనేది ఆమె ఉద్దేశ్యం. పూర్తిగా ఆడవారు స్వేచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీటూ ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరినట్లుగా భావించవచ్చు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరోయిన్ అవ్వడంతో ఈమె మీటూ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-