ఫైటర్ కోసం కిక్ యాస్ స్క్రిప్ట్ రెడీ

0

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి ఎంత ఎగ్జయిటెడ్ గా ఉన్నాడో తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ చిత్రాన్ని ప్రకటించాడు. పూరి-ఛార్మి బృందం స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయారు. గోవా వెళ్లి పూరి స్క్రిప్టు రాసేందుకు చాలానే కసరత్తు చేశాడు. ఇంతకీ స్క్రిప్టు పూర్తయిందా లేదా సెట్స్ కెళ్లేదెపుడు? అంటూ పూరి నుంచి తాజాగా ఆన్సర్ వచ్చింది.

మీకు మాత్రమే చెప్తా ఈవెంట్ లో పూరి తన సినిమా గురించి రివీల్ చేశాడు. ‘మొన్నే స్క్రిప్టు పూర్తయింది .. కిక్ యాస్ స్క్రిప్టు. ఆల్రెడీ విజయ్ కి నేరేట్ చేశాను. ఇవన్నీ వదిలేసి విజయ్ ఎప్పుడొస్తే అప్పుడు షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ పూరి ఎంతో ఉల్లాసంగా చెప్పారు. ఈ వేడుకలో తొలి చిత్ర నిర్మాత విజయ్ దేవరకొండకు .. హీరోగా ఆరంగేట్రం చేస్తున్న తరుణ్ భాస్కర్ కి పూరి-ఛార్మి బ్లెస్సింగ్స్ ఇచ్చారు.

వేడుకలో పూరి మాట్లాడుతూ.. విజయ్ తండ్రిగారైన గోవర్ధన్ నేను స్నేహితులం. ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో నాకు సీనియర్ ఆయన. నేడు ఆయన కొడుకు పెద్ద స్టార్ అయ్యాడు. హోమ్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నారు. వాళ్లు నన్ను ఇక్కడికి పిలిచారు. చాలా సంతోషం. గీతగోవిందం చేస్తున్నపుడు నా తమ్ముడు పరుశురామ్ చెప్పాడు. విజయ్ దేవరకొండతో పని చేయ్ అన్నా.. నువ్వు లవ్ చేస్తావ్ అని.. ఇప్పుడు అదే అనిపిస్తుంది. విజయ్ సినిమా ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నా. గుర్తు పెట్టుకోండి ఫైటర్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది అంటూ రౌడీ ఫ్యాన్స్ లో జోష్ పెంచేశాడు. ఫైటర్ చిత్రీకరణ డిసెంబర్ నాలుగో వారం లో ప్రారంభం కానుంది. కథానాయికలు ఎవరు అన్నది ఫైనల్ చేయాల్సి ఉంది. ఫైటర్ టైటిల్ కి తగ్గట్టే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశాన్ని పూరి రెడీ చేశారట.
Please Read Disclaimer