రానా కోసం అమ్మ త్యాగం ?

0

గత కొంత కాలంగా ఏదో అనారోగ్యంతో బాధ పడుతున్న రానా ఫైనల్ గా కిడ్నీ మార్పిడి ద్వారా పూర్తిగా కోలుకున్నట్టు యుఎస్ రిపోర్ట్. దీన్ని అధికారికంగా ధృవపరిచే ఆధారాలు లేవు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానా తల్లి లక్ష్మి దగ్గుబాటి కిడ్నీ ఒకటి రానాకు మార్పిడి చేయడం వల్ల పూర్తిగా కోలుకున్నట్టు తెలిసింది. అయితే ఇది ఎప్పుడు జరిగింది భారత కాలమాన ప్రకారం ఏ రోజు ఏ టైం అనే వివరాలు తెలియలేదు .

రానాతో పాటే తండ్రి సురేష్ బాబు రానా సోదరి తమ్ముడు అత్తయ్య లక్ష్మితో సహా అందరూ అక్కడే ఉన్నారట ఇంకో రెండు నెలలు పూర్తి రెస్ట్ తీసుకుని రానా ఇండియాకు తిరిగి వస్తాడని తెలిసింది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ యుఎస్ లో చూస్తాడని రానా స్పెషల్ గా వీడియో మెసేజ్ పెట్టడం ఇప్పటికే వైరల్ అయ్యింది .రానా వచ్చాక వేణు ఊడుగుల రూపొందిస్తున్న విరాట పర్వం షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రానా లేకుండానే ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఇది కాకుండా వంద కోట్ల బడ్జెట్ తో గుణ శేఖర్ ప్లాన్ చేసిన హిరణ్యకశిప వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీని కన్నా ముందు హాదీ మేరీ సాధి హిందీ సినిమా బాలన్స్ ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తాడు రానా. తమిళ్ లో కూడా మూవీ పూర్తి చేయాల్సి ఉంది. రానా తిరిగి వచ్చాక సుమారు రెండేళ్లకు సరిపడా కాల్ షీట్స్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. బాహుబలి తర్వాత ఇమేజ్ పెరిగిపోయిన రానా మరోవైపు వెబ్ సిరీస్ లతో పాటు నెంబర్ వన్ యారీ లాంటి టాక్ షోస్ ని రీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. బాబాయ్ కి తగ్గ వారసుడు అనిపించుకునేలా రానా ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది
Please Read Disclaimer