కిడ్స్ కి సమ్మర్ ధమాకా ట్రీట్!

0

సమ్మర్ వస్తోందంటే కిడ్స్ స్పెషల్ ఏం ఉంది? అన్న ప్రశ్న తప్పనిసరి. వేసవి ధమాకా సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు ప్రిపేరవుతుంటాయి. ముఖ్యంగా విజువల్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమాలకు స్కూల్ కాలేజ్ విద్యార్థుల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. ఆంగ్ల చానెళ్ల వీక్షణ వీడియో గేమ్స్ యానిమేషన్ కి చేరువగా ఉన్న నేటి తరానికి హాలీవుడ్ నుంచి వచ్చే భారీ విజువల్ గ్రాఫిక్స్ సినిమాలు ఇట్టే కనెక్టయిపోతున్నాయి. అలా పరిశీలిస్తే ఈ సమ్మర్ లో ధమాకా సినిమాలేవి ఉన్నాయి? అంటే ఓ రెండు భారీ చిత్రాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. `అవెంజర్స్ : ఎండ్ గేమ్` `స్పైడర్మేన్: ఫార్ ఫ్రమ్ హోమ్` చిత్రాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఆయా సినిమాలకు లోకల్ సెలబ్రిటీలు.. స్టార్లు ప్రచారం చేస్తుండడంతో ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద హవా సాగించడం ఖాయమేనని అర్థమవుతోంది.

అవెంజర్స్ సిరీస్ లో ఇప్పటికే పలు సినిమాలు రిలీజై బంపర్ హిట్లు కొట్టాయి. తాజాగా `ఎండ్ గేమ్` పోస్టర్లు టీజర్ ట్రైలర్లు వేడి పెంచుతున్నాయి. పిల్లలు సహా యూత్ లో అవెంజర్స్ తాజా సినిమా గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏప్రిల్ 26న `అవెంజర్స్ ఎండ్ గేమ్` ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆస్కార్ గ్రహీత .. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ.ఆర్.రెహమాన్ ఓ ప్రత్యేకమైన గీతాన్ని డిజైన్ చేస్తున్నారు. `అవెంజర్స్ ఎండ్ గేమ్ – మార్వల్ ఆంథెమ్` పేరుతో ఈ గీతాన్ని పాపులర్ చేయనున్నారు. ఇది `ఎండ్ గేమ్` వసూళ్లకు బిగ్ బూస్ట్ నిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే యానిమేషన్ కేటగిరీలో రిలీజైన `స్పైడర్ మేన్ – హోమ్ కమింగ్` సంచలన విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా రిలీజవుతున్న `స్పైడర్మేన్: ఫార్ ఫ్రమ్ హోమ్` సినిమాపైనా ఆసక్తి నెలకొంది. జూలై 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇంగ్లీష్ హిదీ తెలుగు తమిళంలో రిలీజ్ చేయనున్నారు. 2డి 3డి వెర్షన్లలో వస్తున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ ని ఓ ఊపు ఊపేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఆ రెండు సినిమాలతో పాటు గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్ స్టర్స్ టాయ్ స్టోరి 4 మెన్ ఇన్ బ్లాక్ ది లయన్ కింగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్.. చిత్రాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. గాడ్జిల్లా సినిమాలకు స్కూల్ కిడ్స్ లో ఆదరణ అసాధారణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలాగే ది లయన్ కింగ్ యానిమేషన్ చిత్రానికి థియేటర్లలో ఆదరణ బావుంటుందని అంచనా ఉంది. సమ్మర్లో స్కూల్ పిల్లలకు ధమాకా ఛాయిస్ బోలెడంత ఉంది. ఆ మేరకు లోకల్ సినిమాలకు మెట్రోల్లో థ్రెట్ తప్పదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.
Please Read Disclaimer