ఇండియన్ కిమ్ కర్దాషియన్

0

సోఫీ చౌదరి ఎవరు అని అడిగితే టక్కున చెప్పడం కష్టమే కానీ ఇంట్రో ఇస్తే మాత్రం గుర్తు పట్టే అవకాశం ఉంది. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసింది. బాలీవుడ్ లో పదికి పైగా సినిమాల్లో నటించింది. పేరు చూసి ఈ భామ ఇండియన్ అనుకుంటారేమో. కాదు కాదు..బ్రిటిష్ భామ. సూపర్ సింగర్.. కిరాక్ డ్యాన్సర్. ఎం టీవీ వీజేగా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియా తాట తీయడంలో స్పెషలిస్టు.

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది సోఫీ. ఈ ఫోటోలకు “మీకు నా అవసరం ఉంటే.. నేనెక్కడ ఉన్నానో మీరు కనుక్కోగలరు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే మన అవసరం లేకపోతే దూరంగా ఉంటారు కానీ మన అవసరం ఉంటే హచ్చి కుక్కలా వెనకాలే తిరుగుతారు కదా జనాలు! భలే ఫిలాసఫీ చెప్పింది సోఫీ. ఇక ఫోటోల విషయానికి వస్తే బ్లాక్ మోనోకిని ధరించి సముద్రం ఒడ్డున ఉన్న వుడన్ ర్యాంప్ పై వెల్లకిలా పడుకుంది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్ ధరించి.. ఖజురహో శిల్పానికి లేటెస్ట్ గ్లామర్ వేర్ అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మరో ఫోటోలో క్లోజప్ షాట్. అందాలు దూరంగా ఉంటేనే తట్టుకోలేరు.. ఇక క్లోజప్ లో చూపిస్తే నెటిజన్ల పరిస్థితి ఏం కావాలి?

అందుకే జనాలు వెర్రెత్తిపోయి మరీ లైకులు కొట్టారు. ఈ ఫోటోలకు లైకులు కొట్టినవారిలో మరో బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా కూడా ఉంది. ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. “సోఫీ యూ.. సోహాట్”.. “ఆసమ్ బికినీ.. పర్ఫెక్ట్ షేప్”.. “ఇండియన్ కిమ్ కర్దాషియన్”.. “డామ్ హాట్ గర్ల్ ఇన్ బీ టౌన్” అంటూ పొగడ్తలు కురిపించారు.
Please Read Disclaimer