ఆఫర్ వదులుకున్నందుకు మిలియన్ డాలర్ల గిఫ్ట్

0

కొంతమంది సుడి మామూలుగా ఉండదు. వారేం చేసినా.. లాభమే అన్నట్లు ఉంటుంది. హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ ఇదే కోవకు చెందుతుంది. సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉండటమే కాదు.. భారీ ఫాలోయింగ్ ఉంది. కిమ్ ఇన్ స్టాలో ఆమెకు ఏకంగా 151 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే.. అమ్మడి రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

కిమ్ చేతిలో బోలెడన్ని బ్రాండ్లు ఉంటాయి. వాటిని ప్రచారం చేయటం.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేయటం ద్వారా భారీగా సంపాదిస్తోంది. ఇదిలాఉంటే.. తాజాగా ఆమె తన ఆర్జనకు సంబందించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. సుడి ఉంటే పోయే డబ్బులు కూడా తిరిగి వస్తాయన్న దానికి తగ్గట్లే.. తనకు సంబంధించిన మిలియన్ డాలర్ల విషయానికి సంబంధించి ఒక పోస్టు పెట్టింది. తనకు తానుగా క్యూట్ స్టోరీ అని చెప్పిన ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కిమ్ కు ఒక షూ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే.. అది ఆమె భర్త చేసే బ్రాండ్ కు పోటీ సంస్థ. దీంతో కిమ్ కర్దాసియ్ భర్త ఆమెను.. ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయొద్దని చెప్పటంతో ఆమె రిజెక్ట్ చేశారు. తాను చేసిన ప్రచారం కారణంగా తన భర్త చేసే కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుందన్న ఆలోచనతో నో చెప్పేసింది.

దీనికి కిమ్ భర్త ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. దీనికి ప్రతిగా మదర్స్ డే సందర్భంగా కిమ్ చేతికి మిలియన్ డాలర్ల చెక్కును ఇచ్చాడట. తన మాటను మన్నించినందుకు అంత భారీ మొత్తాన్ని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చేశాడట. దీనికి కిమ్ సైతం మస్తు ఖుషీ అయ్యిందట. ఏమైనా.. మాట విన్నందుకు ఇంత భారీ మొత్తం లభించటంపై ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. స్టార్ డమ్.. దానికి తోడు అభిమానుల క్రేజ్ తో పాటు.. సుడి కలిసి ఉన్నోళ్లకు ఇలాంటి ఆఫర్లే వస్తాయి మరి.
Please Read Disclaimer