ఖడ్గం బ్యూటీ ఖతర్నాక్ బికిని

0

అదేంటో కానీ కిమ్ అనే పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. కిమ్ ఉన్ జోంగ్.. ది లిటిల్ మ్యాన్ అందరికీ తెలిసే ఉంటాడు. ట్రంపే పెద్ద తేడా అనుకుంటే ఆ ట్రంపును టెన్షన్ పెట్టిన బుడ్డి మేధావి. అమెరికా మీద ఎక్కడ బాంబు వేస్తాడో అని అమెరికాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు టెన్షన్ పడ్డాయి.. తర్వాత అంత సద్దుమణిగి ఇప్పుడు ట్రంపు కిమ్ము ఇద్దరూ భాయి భాయి అయ్యారు లెండి. కిమ్ అంటే ఈ కిమ్మే కాదు.. ఇంకో కిమ్ ఉంది.. కిమ్ శర్మ.

నలభైల వయసుకు దగ్గరలో ఉన్న ఈ సీనియర్ బాలీవుడ్ బ్యూటీ ఇప్పటికీ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. ఈ భామ తెలుగులో కూడా మెరిసింది. కృష్ణ వంశీ ‘ఖడ్గం’ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే ప్రత్యేక గీతంలో ఆడిపాడి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా పక్కన పెట్టేస్తే తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఒక పులి ఎమోజిని క్యాప్షన్ గా పోస్ట్ చేసింది. ఫోటోలో పులి చర్మం తరహాలో ఉన్న బికినీ ధరించి ఒక స్విమ్మింగ్ పూల్ గట్టు దగ్గర నిలబడింది.. చెట్ల ఆకుల మధ్య నిలబడి.. ఒక ఆకును తను పట్టుకుని ప్రకృతి కాంతలా కనిపిస్తోంది. అసలే కసరత్తుల బ్యూటీ కావడంతో అనవసరమైన ఫ్యాట్ ఏమాత్రం కనిపించడం లేదు. ఆ వయ్యారం.. సింగారం చూస్తుంటే ఈ భామ సీనియర్ బ్యూటీ అనే విషయం నమ్మలేం.

ఈ భామ బికినీకి కళాపోషకుల స్పందన కేక పుట్టించింది. వర్మగారి వాకిట్లో రంగీలా లేడీ అయిన ఊర్మిళ “వావ్” అంటూ స్పందించింది. “గార్జియస్ జంగ్లి బిల్లీ”.. “వైల్డ్ క్యాట్”.. “జీరో సైజ్ పులి”.. “జపాన్ బేబీ లా ఉన్నావు” అంటూ కొందరు సాధారణ నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు కిమ్ చేతిలో ఆఫర్లేమీ లేవు. పర్సనల్ లైఫ్ లో మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.. తర్వాత హర్షవర్థన్ రాణే తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అయితే ఏమైందో కానీ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు కిమ్ సింగిల్ గా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ హిందీలో పాట పాడుకుంటోందట.
Please Read Disclaimer