కింగ్ ఖాన్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో

0

49 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ కం నిర్మాత గౌరీఖాన్ సోషల్ మీడియాలో రివీల్ చేసిన ఫోటో వేడెక్కిస్తోంది. కింగ్ ఖాన్ షారూక్ సహా ఆర్యన్-సుహానా-అబ్రమ్ లతో కూడుకున్న అద్భుతమైన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది కింగ్ ఖాన్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో అని చెప్పొచ్చు. ఇక ఈ ఫోటో ఎక్కడిది అన్నది గౌరీ వెల్లడించలేదు. అయితే ఆ డెస్టినేషన్ లో మంచు కొండలు కనిపిస్తున్నాయి. దీంతో అది ఉత్తరాదినా.. లేక విదేశమా మంటూ అభిమానులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

ఈ ఫోటోకి షారూక్ ఇచ్చిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్. ‘కొన్నేళ్ల నుంచి ఇంతమంచి ఇంటిని నిర్మించుకున్నాం. గౌరీ నేను దీనిని ఏర్పర్చుకున్నాం. మంచి పిల్లల్ని.. ఫ్యామిలీని సెట్ చేసుకున్నాం’ అంటూ ఎగ్జయిట్ అయ్యారు షారూక్. ఇటీవలే షారూక్- గౌరీఖాన్ తమ 28వ వెడ్డింగ్ యానివర్శరీ జరుపుకున్నారు. 21 ఏళ్ల ఆర్యన్.. 17ఏళ్ల సుహానాకి.. ఆరేళ్ల అబ్రం కి..తల్లిదండ్రులుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ‘ఏదో నిన్ననే జరిగింది అని అనిపిస్తోంది. అదే పెళ్లిలోని గొప్ప బంధం. 30ఏళ్లు గడిచినా అలానే అనిపిస్తోంది మనతో ఇప్పుడు ముగ్గురున్నారు. ఒక మనిషికి ఎంతటి అందమైన ఆహ్లాదకరమైన లైఫ్ కావాలో అది నాకు దక్కింది. నాలో సంతోషంగా ఉంది’ అంటూ షారూక్ పోయెటిక్ గానూ స్పందించాడు.

ఆర్యన్- సుహానా ప్రస్తుతం విదేశాల్లో స్టడీస్ లో బిజీ. ఓ వైపు నటశిక్షణతో పాటు ఉన్నత చదువులు చదువుతున్నారు. అలాగే అబ్రం తన తల్లిదండ్రులతోనే ముంబైలో ఉంటున్నాడు. సుహానా తొందర్లోనే కథానాయికగా పరిచయం కానుంది. ఆ తర్వాత ఆర్యన్ నటనలోకి ప్రవేశించే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక వారసులు కింగ్ ఖాన్ షారూక్ లెగసీని ఎలా ముందుకు తీసుకెళ్లనున్నారు? అన్నది చూడాలి.
Please Read Disclaimer