‘బిగ్ బాస్’ కోసం గెటప్ మార్చిన ‘కింగ్’ నాగ్…!

0

‘కింగ్’ నాగార్జున నాలుగు నెలల తర్వాత మేకప్ వేసుకున్నాడు. అయితే అది ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసమో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో చేయబోయే మూవీ కోసమో అనుకుంటే పొరపాటే. నాగార్జున మేకప్ వేసుకుంది ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కోసం. బుల్లితెరపై ‘బిగ్’బాస్’ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్స్ సక్సెస్ అవ్వగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఈ షో స్టార్ట్ చేయాలని భావించినా కరోనా నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇటీవల ఈ షో త్వరలోనే ప్రారంభం కానుందని ‘స్టార్ మా’ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్-4కు ఎవరు హోస్ట్ చేస్తారో అనే ఆసక్తి మొదలైంది.

తెలుగు ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. సీజన్ 2కు నేచులర్ స్టార్ నాని హోస్ట్ చేసారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. వ్యాఖ్యాతగా నాగార్జున తనదైన శైలిలో షోను ఆసాంతం రక్తి కట్టించారు. అందుకే స్మాల్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా ‘బిగ్ బాస్’ సీజన్ 3 నిలిచింది. ఈ క్రమంలో నాల్గవ సీజన్ కి కూడా ‘కింగ్’ నాగార్జున నే హోస్ట్ గా కంటిన్యూ చేస్తున్నారని అధికారికంగా వెల్లడించారు. నాగ్ సోషల్ మీడియా వేదికగా ”బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్ లైట్.. కెమెరా యాక్షన్” అంటూ యాడ్ షూట్ కి సంబందించిన ఫోటోలు షేర్ చేశారు. అయితే నాగార్జున ‘బిగ్ బాస్’ సీజన్ 4 కోసం తన గెటప్ కూడా చేంజ్ చేస్తున్నారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్’ యాడ్ కోసం కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా గుండుతో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాగ్ ‘దశావతారం’ సినిమాలో కమల్ లాగా మేకప్ వేసుకుంటూ కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ కోసం షూట్ చేస్తున్న యాడ్స్ లో ఈ గెటప్ లో ఒకటి ఉండబోతోందని తెలుస్తోంది. స్టార్ మా వాళ్ళు త్వరలోనే ఈ యాడ్స్ వదిలే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరెవరు పాల్గొంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్ చేసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఫిజికల్ టాస్క్ లు లేకుండా షోను డిఫరెంట్ గా ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.