కింగ్ ఫిషర్ క్యాలెండర్ రెడీ అవుతోందోచ్

0

క్యాలెండర్లు చాలానే ఉంటాయి. వారం.. వర్జం.. రాహుకాలం ఇలాంటి సాంప్రదాయ విషయాలు ఉండే క్యాలెండర్లు వేరు. అయితే ఈ క్యాలెండర్లు కాకుండా హాటు క్యాలెండర్లు కూడా ఉన్నాయి. వాటిలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ప్రముఖమైనది. ఈ క్యాలెండర్లో ప్రతి ఏడాది కొత్త బికిని భామలు దర్శనమిస్తారు. ఒక మోడల్ కెరీర్ లో ఇలా కింగ్ ఫిషర్ క్యాలెండర్లో బికినీ భామగా మెరవడం ఒక ఘనత.

ఈసారి 2020 కింగ్ ఫిషర్ క్యాలెండర్ రెడీ అవుతోంది. ఇది 18 వ ఎడిషన్. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బేకర్ ప్రస్తుతం ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం ఫోటో షూట్లు చెయ్యడంలో బిజీగా ఉన్నారట. ఈసారి ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో జోయా అఫ్రోజ్.. పూజ చోప్రా.. ఐశ్వర్య సుష్మిత.. అదితి ఆర్య లాంటి టాప్ లీగ్ మోడల్స్ కనిపిస్తారు. సౌత్ ఆఫ్రికాలోని అందమైన లొకేషన్లలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటో షూట్ జరిగింది. ఈ క్యాలెండర్ కు సంబంధించిన ఫైనల్ వెర్షన్ నుంచి కొన్ని ఫోటోలు తాజాగా విడుదల అయ్యాయి. ఈ శాంపిల్ చూస్తేనే క్యాలెండర్ ఎంత హాట్ గా ఉంటుందనేది అర్థం అవుతుంది.

పైనున్న ఫోటోలో ఐశ్వర్య సుష్మిత పింక్ బికినీలో అందాలను ధారపోసింది. పేరులోనే ఇద్దరు అందాల రాశులు ఉన్నారు.. దానికి తగ్గట్టే ఇద్దరిని మిక్సీలో వేసినట్టుగా ఉంది ఈ క్యాలెండర్ భామ. కింగ్ ఫిషర్ 2020 క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేస్తారు.
Please Read Disclaimer