ఖాన్ సాబ్ డాటర్ కత్తిలాంటి పోజు

0

బాలీవుడ్లో స్టార్ కిడ్స్ పై అమితాసక్తి ఉంటుంది. వారి ప్రతి కదలిక ఒక హాట్ న్యూస్. దాదాపుగా వారందరూ ఏదో ఒకరోజు కరణ్ జోహార్ నెపోటిజం కాలేజి స్టూడెంట్లుగా సినిమాల్లోకి రావల్సిందే కాబట్టి నెటిజన్లు కూడా ఈ విషయంలో ఫిక్స్ అయి ఉంటారు. త్వరలో అలా బాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయం కానున్న స్టార్ కిడ్ సుహానా ఖాన్ డాటర్ ఆఫ్ షారూఖ్ ఖాన్. ఈ విషయం అధికారికంగా ఇంకా ఎవరూ చెప్పలేదు కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి.

సుహానా ఖాన్ రీసెంట్ గా లండన్ లోని ఆర్డింగ్లీ కాలేజిలో తన చదువు పూర్తి చేసుకొని ముంబైకి తిరిగి వచ్చింది. షారుఖ్ ఫ్యామిలీ ఈ సందర్భంగా మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్ళారు. ఓ వారం రోజుల పాటు షారుఖ్ ఫ్యామిలీ అక్కడ సరదాగా గడిపింది. షారుఖ్.. వైఫ్ గౌరీ.. పిల్లలు ఆర్యన్.. సుహానా.. అబ్రామ్ లు అందరూ ఈ ట్రిప్ లో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారట. ఈ హాలిడేలో సుహానా తీయించుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఒక బోటుపై కూర్చున్న సుహానా స్టైల్ గా పోజిచ్చింది. బటన్లు వేసుకోకుండా ఒక షర్టు.. డెనిమ్ షార్ట్.. ధరించి హాట్ బ్యూటీ తరహాలో కనిపించింది. డార్క్ కలర్ లిప్ స్టిక్.. గాలికి ఎగురుతున్న జుట్టు సుహానా హాట్ నెస్ ను మరింతగా పెంచాయి.

సుహానా ఇంకా హీరోయిన్ గా పరిచయం కాలేదు కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే సూపర్ పాపులారిటీ ఉంది. ఎంట్రీ ఇవ్వకముందే ఇలా ఉంటే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత షారూఖ్ డాటర్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
Please Read Disclaimer