టీజర్ టాక్: ‘కిస్’

0

తెలుగు లో ఈమధ్య బూతు సినిమాల ట్రెండ్ ఊపందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరీ బూతు అంటే పచ్చిగా ఉంటుందేమో కానీ అడల్ట్ సినిమా అని స్టైల్ గా పిలుచుకుంటే సరి. ఈ ట్రెండ్ లో భాగంగా రానున్న మరో అడల్ట్ ఫిలిం ‘కిస్’. ఈ చిత్రానికి దర్శక నిర్మాత శివ. సినిమా పేరు రొమాంటిక్ గా ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం ఫసక్కు గా ఉన్నట్టనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

టీజర్ ఓపెన్ చెయ్యగానే కామోద్రేకం తో హీరో హీరోయిన్లు ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఇద్దరు లేకుండా ఒక్కరుగా మారాలనే శృంగార తత్వాన్ని ప్రకటిస్తుంటారు. ఆ ఉద్రేకంలో వాళ్ళ పనిలో వారు ఉంటుంటే నేపథ్యంలో కిస్.. కిస్ కిస్ కిస్ అంటూ గుసగుసలాడుతున్నట్టుగా ఓ పాట ప్లే అవుతూ ఉంటుంది. ఈ సమయం లో ఒక ఆవిడ పాలలో ఒక టాబ్లెట్ వేసి కలుపుతూ ఉంటుంది. “ఈ వయాగ్రాతో ఎలాగైనా.. నాకొడు**ని వశపరుచుకుంటాను” అంటూ ఒక కసక్కు డైలాగ్ చెప్తుంది హీరోయిన్. నెక్స్ట్ సీన్ లో హీరో ఫ్రెండ్ “ఏంటి.. దెయ్యం పోర్న్ వీడియోస్ చూస్తుందా?” అంటూ అవాక్కవుతూ తన ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఫైనల్ గా ‘దెయ్యం వయాగ్రా మింగితే’ అంటూ క్యాప్షన్ ఇస్తారు.

“దెయ్యం వయాగ్రా మింగితే” అనే ప్రశ్న బూతు ప్రియులను ఊహలను రెచ్చగొట్టేలా ఉంది. అయితే టీజర్ ను చూస్తుంటే టెక్నికల్ గా సినిమా స్థాయిలో కనిపించడం లేదు. మరి సినిమా కూడా అలానే ఉంటుందా లేక బూతు ప్రియులు ఎగబడి చూసేలా ఉంటుందా అనేది ట్రైలర్ రిలీజ్ అయితే కానీ తెలియదు. అంతలోపు ఈ టీజర్ ను చూసేయండి.
Please Read Disclaimer