యాక్సిడెంట్ లో నటుడు మృతి

0

తమిళ నటుడు మనో నిన్న చెన్నై శివారు ప్రాంతంలో మీడియన్ రోడ్డులో యాక్సిడెంట్ కు గురయ్యాడు. కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకుని కారులో వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో మనో మరియు ఆయన భార్య ఉన్నారు. మనో అక్కడికక్కడ మృతి చెందడంతో ఆయన భార్య మాత్రం ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మీడియన్ రోడ్డులో స్పీడ్ గా వస్తున్న మనో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందట. స్థానికులు వెంటనే మనో మరియు ఆయన భార్యను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మనో అప్పటికే మృతి చెందినట్లుగా వైధ్యులు తెలియజేశారు. మనో భార్య కొన ఊపిరితో ఉండగా ఆమెను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమెను మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ కు తరలించే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

ఇక మనో తమిళ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటుడు. మొదట మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన మనో కొన్ని వేల ప్రదర్శణలను ఇచ్చాడు. ఆ తర్వాత హోస్ట్ గా కొనసాగాడు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాలను చేశాడు. మల్టీ ట్యాలెంటెడ్ అంటూ గుర్తింపు దక్కించుకున్న మనో ఇలా హఠాత్తుగా మరణించడంతో ఆయన సన్నిహితులు మరియు తమిళ సినీ వర్గాల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer