స్వీట్‌హార్ట్‌తో హాట్ నటి స్నానం.. వీడియో వైరల్

0

ప్రముఖ తమిళ నటి సాక్షి అగర్వా్ల్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2020 క్యాలెండర్ ఫొటోషూట్‌లో భాగంగా సాక్షి కేరళలోని అలెప్పీ వెళ్లారు. అక్కడ ఓ ఏనుగుపై కూర్చుని సెక్సీ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. ఏనుగు సాక్షిపై తొండంతో నీళ్లు పోస్తుంటే ఆ వీడియోను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘రాజా (ఏనుగు పేరు)తో కలిసి షూట్ చేస్తుంటే ఎన్నో భావోద్వేగాలు కలిగాయి. రాజా నా స్వీట్ హార్ట్. ఏనుగుతో షూట్ చేయడానికి ముందు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. నా వల్ల కానీ ఫొటోల వల్ల కానీ ఏనుగుకు ఎలాంటి హాని కలిగించలేదు’ అని పేర్కొన్నారు. తమిళంలో ‘రాజా రాణి’ చిత్రంతో సాక్షి సినీ పరిశ్రమకు పరిచయమైంది.

READ ALSO: సూసైడ్ చేసుకోవాలని అనిపించింది: ఇలియానా షాకింగ్ కామెంట్స్

ఆ తర్వాత ‘కాలా’ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కోడలు పాత్రలో కనిపించింది. కమల్ హాసన్ హోస్ట్ చేసిన సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్ 3లోనూ పాల్గొంది. సినీ ఇండస్ట్రీలో క్యాలెండర్ ఫొటోషూట్స్‌కు బాగా పాపులారిటీ ఉంది. ఓ క్యాలెండర్ నిండా హీరో, హీరోయిన్ల ఫొటోలను ప్రింట్ చేస్తుంటారు. వివిధ పోజుల్లో సెలబ్రిటీలు పోజులిస్తే చాలు హీరో, హీరోయిన్లకు భారీ మొత్తంలో పారితోషికం ఇస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ క్యాలెండర్ ఫొటోషూట్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ స్టార్ సెలబ్రిటీల ఫొటోలను తీసి క్యాలెండర్స్ రిలీజ్ చేస్తుంటాడు. ఇతని క్యాలెండర్స్‌కు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది.
Please Read Disclaimer