‘నిశబ్దం’ అనుష్క చేతికెలా వచ్చిందంటే ?

0

కొన్ని కథలు కొందరు స్టార్స్ దగ్గరికి వెళ్లి చివరికి రాసిపెట్టి ఉన్న స్టార్ చేతిలో పడటం సహజమే. లేటెస్ట్ గా ‘నిశబ్దం’ విషయంలోనూ అదే జరిగిందట. అవును ఈ సినిమాను అనుష్క కంటే ముందు మరో హీరోయిన్ తో ప్లాన్ చేసాడట కోన వెంకట్. ముందుగా అనుకున్న హీరోయిన్ డేట్స్ కుదరలేదని – ఇక సినిమా డిలే అవుతూ రావడం వల్ల ఆ అమ్మాయి వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పేసింది. ఇక సినిమా అంతా యూ.ఎస్ లోనే షూట్ అనుకోవడంతో మరో స్టార్ హీరోయిన్ కోసం వెయిట్ చేసామని అదే సమయంలో అనుష్క కి ఎయిర్ పోర్ట్ లో కథ వినిపించి ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నామని అన్నాడు.

అయితే ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఆలస్యం అవ్వడం వల్ల అనుష్క కోనా వెంకట్ పక్కనే కుర్చుందట. ఆ సమయంలో స్వీటీని ఇంప్రెస్ చేసి ఈ సినిమాకు ఒప్పించేసాడట కోనా. అయితే అప్పుడు సరిగ్గా ఏమైందో చెప్తే ఒక సినిమా తీయొచ్చని అన్నాడు. సో అలా ఒక హీరోయిన్ చేయాల్సిన సినిమా స్వీటీ చేతిలో పడిందన్నమాట. మరి నిశబ్దం కి ముందు అనుకున్న ఆ హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Please Read Disclaimer