మెగా తండ్రి కూతురు ప్రేమకు చిహ్నం

0

మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు.. ఫ్యాన్స్.. ఇండస్ట్రీ వారు ఎంతో మంది ఎన్నో రకాలుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి కంటే చాలా విభిన్నంగా నిహారిక తన తండ్రికి బర్త్ డే విషెష్ తెలియజేసింది. నాగబాబు మరియు నిహారికలు ఎంత అన్యోన్యంగా ఉంటారో అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఇద్దరు కూడా తండ్రి కూతురు మాదిరిగా కాకుండా స్నేహితుల మాదిరిగా కలిసి పోతారు.

ఇద్దరు కూడా చాలా సరదగా ఉంటారు. ఇంట్లోనే కాకుండా బయట కూడా ఇద్దరు సరదాగా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. నాగబాబు పుట్టిన రోజున నిహారిక పెట్టిన ఈ మద్దు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక తల్లి తన కొడుకును నుదురుపై ముద్దు పెడుతుంది. అలా నాగబాబును నిహారిక నుదురుపై ముద్దు పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఈ ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు ఐ లవ్ యు నాన్న.. నాకు నీపై ఉన్న ప్రేమను పెట్టుకునేందుకు ఇంకా పెద్ద గుండె కావాలని కోరుకుంటున్నాను. నీవు మాత్రమే నన్ను అందరి కన్నా ఎక్కువగా నవ్విస్తావు అంటూ ట్వీట్ చేసింది. నాగబాబు తనయుడు వరుణ్ సందేశ్ కూడా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియలో పోస్ట్ పెట్టాడు.
Please Read Disclaimer