ఇది మెగాస్టార్ క్లిక్

0

మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులకు ఎంత ప్రాధాన్యతనిస్తారో అందరికీ తెలిసిందే. ఇక కోడలమ్మ ఉపాసన అంటే చిరుకు ప్రత్యేక అభిమానం. మరోవైపు ఉపాసనకు కూడా మామగారు అంటే ఎంతో గౌరవం. నిన్న డాటర్స్ డే సందర్భంగా ఉపాసన తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.. ఈ పోస్ట్ చూస్తేనే వారిద్దరూ మామగారు.. కోడలు లాగా కాకుండా నాన్నగారు.. కూతురులా ఉంటారనే విషయం మనకు అర్థం అవుతుంది.

నిన్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా.. ఈ కార్యక్రమానికి ఉపాసన ఒక అందమైన డ్రెస్ లో చక్కగా ముస్తాబై వచ్చారు. ఆ భారీ ఈవెంట్లో ఉపాసన తన గ్రేస్ తో.. అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చిరు కూడా తన కోడలమ్మను చూసి ముచ్చటగా అనిపించడంతో స్వయంగా ఫోటోలు తీశారట.. ఈ విషయం స్వయంగా ఉపాసన తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ‘#సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత స్వీటెస్ట్ మామగారు నా ఫోటోలు తీశారు. ఈరోజు ఆయనకు నా డ్రెస్సింగ్ ఎంతో నచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేషనల్ డాటర్స్ డే ను ఇలా అద్బుతంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ ఫోటోలో ఉపాసన చిరునవ్వులు చిందిస్తూ పోజిస్తే.. మామగారు ఫోటో తీస్తున్నారు. ఉపాసనకు ఎడమవైపున చిరు ప్రతిబింబం కనిపిస్తుంది.. ఒకసారి లుక్కేయండి. ప్రపంచంలో ఉండే అందరూ మామలు ఇలా మెగాస్టార్ లాగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా!
Please Read Disclaimer