ఆ సినిమాలెప్పుడు కొరటాల

0

‘మిర్చి’ తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ తక్కువ టైంలోనే బడా సినిమాలతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ‘భరత్ అనే నేను’ తర్వాత మెగా స్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ లో ఉంది. ‘సైరా’ రిలీజ్ తర్వాత చిరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడని అంటున్నారు.

అయితే కొరటాల చిరు తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా..అనే విషయం ఇప్పుడు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫాన్స్ ను కూడా చర్చ అవుతుంది. నిజానికి ‘జనతా గ్యారేజ్’ తర్వాత తారక్ కొరటాల మరో సినిమా చేయాలనీ ఫిక్సయ్యారు. ఆ దిశగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ కాంబోలో సినిమాను నిర్మించాలనుకున్నారు. అయితే అది అనౌన్స్ మెంట్ దగ్గరే ఆగిపోయింది.

ఇక చిరు సినిమా కంటే ముందే రామ్ చరణ్ తో కొరటాల డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పుడెప్పుడో కొరటాల చరణ్ సినిమా లాంచ్ వరకూ వెళ్లి ఆగిపోయింది. అయితే మళ్ళీ ఈ కాంబోలో సినిమా అనే సరికి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ వస్తుందని ఊహించారు. కట్ చేస్తే ఆ సినిమా ఆపేసి ఇప్పుడు చిరుతో సినిమా చేస్తున్నాడు కొరటాల. అయితే చరణ్ తో చేయాల్సిన డేట్స్ చిరు కోసం కేటాయించి మెగా స్టార్ కోసం మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు కొరటాల. అయితే ఇప్పుడు చిరు తర్వాత తారక్ తో చేసే చాన్స్ లేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు. మరి కొరటాల మళ్ళీ మెగా హీరో చరణ్ తో సినిమా చేస్తాడేమో.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home