మెగా 152 కు ఆమె ఫైనల్ అయినట్లేనా?

0

చిరంజీవి 152వ చిత్రం గురించి గత సంవత్సర కాలంగా వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. భరత్ అనే నేను చిత్రం తర్వాత కొరటాల శివ స్క్రిప్ట్ రెడీ చేసి చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నాడు. సైరా చిత్రం వల్ల ఇంత కాలం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే చిరు 152 చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలో యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.

చిరు 152వ చిత్రం కోసం నయనతార.. కాజల్.. అనుష్క వంటి స్టార్ హీరోయిన్స్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు చిరంజీవికి జోడీగా త్రిషను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో చిరంజీవితో త్రిష ‘స్టాలిన్’ చిత్రంలో నటించింది. హీరోయిన్ గా త్రిష ఫేడ్ ఔట్ అయినట్లుగా అనిపించినా మళ్లీ పుంజుకుంటుంది. తమిళంలో ఈమె 96 చిత్రంతో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది.

తెలుగులో ఇంకా త్రిషకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమెను ఈ చిత్రం కోసం ఎంపిక చేయాలని భావిస్తున్నారు. కొరటాల శివ సినిమాలో హీరోయిన్స్ పాత్రలకు కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే హీరోయిన్ ఎవరైనా పెద్దగా ఇబ్బంది ఉండదని మెగా అభిమానులు కూడా త్రిష అయితే పర్వాలేదు అంటున్నారు. చిరంజీవితో కొత్త హీరోయిన్స్ మరీ చిన్నగా ఉంటారని.. త్రిష అయితేనే బెటర్ అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాదాపుగా త్రిష కన్ఫర్మ్ అయినట్లే. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer