మైత్రీ మూవీ మేకర్స్ తో మరోసారి కలవబోతున్న స్టార్ డైరెక్టర్…?

0

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే డైరెక్టర్ అని చెప్పవచ్చు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ వంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ క్రమంలో కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. కాగా కొరటాల శివ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారితో మరో సినిమాకి వర్క్ చేయబోతున్నారట.

కొరటాల శివ మైత్రీ మూవీ మేకర్స్ కోసం ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ చిత్రాలను రూపొందించాడు. ఈ క్రమంలో వారితో కొరటాలకి మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుండి మైత్రీ మూవీ మేకర్స్ తీయబోయే సినిమాల విషయంలో సలహాలు ఇస్తూ ఉంటాడట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా సెట్ అవడానికి కొరటాల శివ కూడా ఒక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాని కూడా మైత్రీ మేకర్స్ కోసం సెట్ చేసే పనిలో ఉన్నాడట కొరటాల.

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారట. ఇకపోతే ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివ సలహాలు ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న బాబీ త్వరలోనే చిరంజీవికి వినిపించబోతున్నాడట. ఇక కొరటాల శివ కూడా తనకు కుదిరిన సమయంలో మైత్రీ వారితో కూర్చొని ఆ స్క్రిప్ట్ విషయంలో సహాయం చేస్తాడట. దీని కోసం మైత్రీ వారు కొరటాలకి కొంత మొత్తం చెల్లించనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer