చరణ్.. కొరటాలను అలా లాక్ చేశారా?

0

టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ల లిస్టులో రాజమౌళి తర్వాత కొరటాల శివ పేరే వినిపిస్తోంది. వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కావడంతో ఆయన డిమాండ్ పీక్స్ లో ఉంది. పెద్ద స్టార్ హీరోలకు తప్ప మీడియం రేంజ్ హీరోలకు కూడా కొరటాల శివతో పని చేసే అవకాశం దక్కడం లేదు. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక కొరటాల శివ నెక్స్ట్ సినిమాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. కొరటాల శివతో రామ్ చరణ్ మూడు సినిమాల అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఆ అగ్రిమెంట్ లో భాగంగా తెరకెక్కుతున్న మొదటి సినిమా #చిరు152. ఇక మిగిలిన రెండు సినిమాల్లో ఒక సినిమా కొరటాల-ప్రభాస్ కాంబినేషన్ లో ఉంటుందట. మరి మూడవ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కొరటాల శివ లాంటి హాట్ షాట్ డైరెక్టర్ తో మూడు సినిమాల అగ్రిమెంట్ కు ఒప్పించాడంటే చరణ్ టాలెంట్ ను మనం ఒప్పుకోవాల్సిందే.

అందులో ఫస్ట్ ఫిలిం మెగాస్టార్ చిరంజీవితో కాబట్టి బిజినెస్ పీక్స్ లో ఉంటుంది. ఇక మరో సినిమా ప్రభాస్ తో కాబట్టి క్రేజ్ ఆకాశాన్ని టచ్ చేయడం ఖాయం. ఇక మూడవ సినిమాలో చరణ్ తనే హీరోగా చేస్తారా లేదా మరో హీరోతో ప్లాన్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా మూడు క్రేజీ ప్రాజెక్టులే. ఈ లెక్కన ఇతర హీరోలకు కొరటాల శివ మరో రెండేళ్ళు దొరకడన్నమాట!
Please Read Disclaimer