క్రాక్ ఆ సినిమా కు ఫ్రీమేక్?

0

మాస్ మహారాజా రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్లో ‘క్రాక్’ అనే టైటిల్ తో కొత్త సినిమా గురువారం లాంచ్ అయింది. రవితేజ -మలినేని కాంబినేషన్లో గతం లో ‘డాన్ శీను’.. ‘బలుపు’ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రచారం లో ఉన్నాయి. ఈ సినిమా కథ గత ఎన్నికల నేపథ్యం లో ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ అదేమీ నిజం కాదని సమాచారం.

ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా ‘సేతుపతి’ కి ప్రేరణగా తీసుకున్నారని ఇన్సైడ్ టాక్. నిజానికి ‘సేతుపతి’ సినిమా రిమేక్ ను తెలుగు లో గంటా శ్రీనివాస రావు తనయుడు హీరోగా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఫలితం మాత్రం నిరాశ పరిచింది. కానీ మాస్ మహారాజా కు ‘సేతుపతి’ సినిమా థీమ్ నచ్చడం తో ఆ సినిమా కథకే కొన్ని మార్పులు చేసి ‘క్రాక్’ కథను తయారు చేసినట్టు గా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం నిర్థారణ కావాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడక తప్పదు.

ఈ సినిమా లో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ హౌస్ వైఫ్ పాత్ర లో హోమ్లీ గా కనిపిస్తుందని సమాచారం. థమన్ ఈ సినిమా కు సంగీత దర్శకుడు. ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer