ఆ సినిమా ముగ్గురికి కీలకమే

0

ఎవరెన్ని సినిమాలు చేసినా పక్కా కమర్షియల్ సినిమా చేసినప్పుడు వచ్చే కిక్కే వేరు. మాస్ యాక్షన్ కంటెంట్ తో బీసీ ఆడియన్స్ ను ఆకట్టుకొని భారీ వసూళ్లు సాధించే కమర్షియల్ సినిమా మీద అందరికీ ఆశలుంటాయి. ఇప్పుడు అవే ఆశలతో సినిమా మొదలెట్టారు రవితేజ గోపిచంద్ శ్రుతి హాసన్.

ఈ ముగ్గురికి ఇప్పుడు అర్జెంట్ గా సక్సెస్ కావాలి.అందుకే ఓ కమర్షియల్ సినిమాకు జత కట్టారు. గోపిచంద్ మలినేని ‘విన్నర్’ తర్వాత చాలా టైం తీసుకొని ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

ఇక రవి తేజ పరిస్థితి కూడా అంతే. మనోడికి హిట్ సినిమా పడి చాలా ఏళ్ళయింది. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నా ఇందులో కమర్షియల్ అంశాలు తక్కువే ఉంటాయట. పూర్తిగా కామెడీపైనే ఆధారపడి సినిమా చేస్తున్నాడు మాస్ మహారాజ్. అందుకే గోపిచంద్ తో చేస్తున్న ‘క్రాక్’ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా మళ్లీ ఓ సక్సెస్ అందిస్తుందని ఆశిస్తున్నారు. మరి వీరి కోరిక ‘క్రాక్’ తీరుస్తుందా చూడాలి.
Please Read Disclaimer