సీన్ వివరిస్తూ హీరోకి ‘లిప్ కిస్’ ఇచ్చేసిన డైరెక్టర్..!

0

ఒక్కోసారి సినిమా రూపొందించే టైంలో దర్శకుడు ఎన్నో ఊహలతో సన్నివేశం మలుచుకొని రాసుకుంటాడు. అది సినిమాలోకి కనిపించేటప్పడికి సన్నివేశం దర్శకుడు ఆలోచనకు.. అతని ఊహకు దగ్గరగా రావడానికి చాలా మంది దర్శకులు నటించి చూపిస్తారు. స్టార్ డైరెక్టర్లు రాజమౌళి.. పూరీ జగన్నాథ్.. రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా హీరోకి నటించి చూపిస్తారు. అలా అని అన్నీ సన్నివేశాలు కాదు.. వారికి కావాల్సిన ఎమోషన్స్ ఆ సన్నివేశంలో సరిగ్గా కనిపించకపోతే ఎంతటి స్టార్ హీరో అయినా వారికి ప్రతీ సన్నివేశం నటించి జీవించేలా చూపిస్తారు దర్శకులు. ఒక దర్శకుడుగా అది అతనికి ప్లస్ పాయింటే. అది కాస్త ఎక్కువై హద్దులు దాటితే ఇబ్బందే అని చెప్పాలి. అలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అలాంటి ఓ ఫోటో సినీ అభిమానులకు షాక్ ఇస్తుంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. దర్శకుడు హీరోకి లిప్ కిస్ ఇవ్వడం. ఇండస్ట్రీలో రెండేళ్లుగా ఓ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. అది షూటింగ్ జరుపుకున్నట్లు కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. క్షణం ఫేమ్ రవికాంత్ దర్శకత్వంలో “కృష్ణ అండ్ హిజ్ లీల” అనే ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీలో ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంది. డైరెక్టర్ ఆ సీన్ హీరోకి వివరించే క్రమంలో ఆల్మోస్ట్ అతన్ని ముద్దు పెట్టుకున్నంత పని చేశాడు. ఇక వారిద్దరూ లిప్ లాక్ పోజులో ఉన్న ఫోటో బయటికి వచ్చేసరికి నెటిజెన్లు ఖంగు తింటున్నారు. ఇక ఈ “కృష్ణ అండ్ హిజ్ లీల” మూవీ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ అని తెలుస్తుంది. హీరో రానా ఈ సినిమాను నిర్మించడం విశేషం.
Please Read Disclaimer