ఈసారి ‘రొమాన్స్’తో రెచ్చిపోయిన జెర్సీ హీరోయిన్!

0

క్షణం లాంటి సస్పెన్సు థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ రవికాంత్ పేరెపు ఈసారి తన రెండో సినిమాగా ‘కృష్ణ అండ్ హిస్ లీల’ అనే సినిమాను లైన్లో పెట్టాడు. తన తొలి సినిమాకు పూర్తి భిన్నమైన చిత్రమే తీసినట్లున్నాడు రవికాంత్. పేరుకు తగ్గట్లే ఒక రొమాంటిక్ కుర్రాడి కథను చెప్పబోతున్నాడు. అమ్మాయిని చూస్తే టెంప్ట్ అయిపోవడం ఫ్లర్ట్ చేయడం.. రిలేషన్షిప్ మొదలుపెట్టడం.. అది ముగిశాక ఇంకో అమ్మాయిని తగులుకోవడం.. ఇదీ ఈ సినిమాలో హీరో గారి పని అని టీజర్ చూస్తే తెలుస్తుంది. తనకున్న ఈ బలహీనత గురించి హీరోనే నరేట్ చేసుకుంటూ సాగే టీజర్ ఆసక్తికరంగానే అనిపిస్తోంది. సిద్ధుతో పాటు హీరోయిన్లు శ్రద్ధ శ్రీనాథ్ – షాలిని వడ్నికట్టి సీరత్ కపూర్ నటిస్తున్నారు. సినిమాలో రొమాన్స్ ఓ రేంజిలో ఉంటుందని టీజర్ ను బట్టి అర్థమవుతోంది.ఇక ఇటీవలే విడుదల చేసిన టీజర్ లో జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ భరతనాట్యం డాన్సర్ గా కనిపిస్తుంది. కానీ ఆమెను తన మాటలతో ఇంప్రెస్స్ చేసి ఇంటిమేట్ సీన్స్ లాగించాడు హీరో. శ్రద్ధ జెర్సీలో ఎంత క్యూట్ గా చీర కట్టుకొని యాక్టింగ్ చేసిందో ఇందులో అంత రెచ్చిపోయిందని చెప్పవచ్చు. హీరో సిద్దుతో పాటు లిప్ లాక్ సన్నివేశాలతో వేడి పుట్టించేలా ఉంది. ప్రస్తుతం టీజర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాతో రవికాంత్ తనని తను నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక హీరో సిద్ధు రవికాంత్ తో కలిసి ఈ చిత్రానికి స్క్రిప్టు రాయడం విశేషం.

సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఓటిటిలో విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు త్వరలో ప్రకటిస్తామన్నారు.
Please Read Disclaimer