ముగ్గురు సూపర్ హీరోస్ ని చూశారా?

0

భార్యను అర్థనారీశ్వరి అంటారు. బాలీవుడ్ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆ ఫ్యామిలీలోకి వచ్చాక ఛేంజ్ పై నిరంతరం అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. మహేష్ స్టైల్ మారింది.. లైఫ్ స్టైల్ మారింది. అది `పోకిరి` ప్రాజెక్ట్ సెట్ కావడానికి ముందు నుంచే సీన్ ఛేంజ్ చేసిన ఘనత నమ్రతదేనని చెబుతుంటారు. అటుపై మహేష్ విజయాల పరంపర కూడా గణనీయంగా పెరగడం వెనక నమ్రతనే కారణం. ఇక కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైన మహేష్ ని కమర్షియల్ యాడ్స్ వైపు రాణించేలా చేయడంలోనూ నమ్రతదే కీలక పాత్ర అని చెబుతుంటారు. నేడు ఏఎంబీ మాల్ అధినేతగా ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగడం వెనకా తన ప్లానింగ్ గురించి విశ్లేషణలెన్నో.

తన క్రేజ్ కి తగ్గట్టుగా సూపర్ స్టార్ కెరీర్ ని.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచింది కూడా ఒక విధంగా నమ్రత ప్లానింగ్. మహేష్ తన స్టైల్ ని.. తను చేసే సినిమాల పంథాని మార్చుకున్నారని చెబుతారు. మహేష్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇంటరాక్షన్ విషయంలో కానీ.. అలాగే సాటి హీరోలతో స్నేహం.. అభినందించే విషయంలో కానీ ముందుంటున్నారంటే నమ్రత సహకారం ప్లానింగ్ వల్లనే ఇది కుదిరింది. ఇలా మహేష్ జీవితాన్ని ప్రభావితం చేస్తూ సమూలంగా మారుస్తూ వస్తున్న నమ్రత ఈ మధ్య సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా వుంటున్నారు. ఎలాంటి విషయాన్నైనా వెంటనే అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా ఇన్ స్టాలో ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించిన మూడు తరాల వారసుల ఫొటోలని షేర్ చేసి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేయడం ఆకట్టుకుంటోంది. ఒకే తరహాలో డ్రెస్సింగ్ చేసుకున్నసూపర్ స్టార్ కృష్ణ- ప్రిన్స్ మహేష్- మాస్టర్ గౌతమ్ ఫొటోలని జత చేసి `నా ముగ్గురు సూపర్ హీరోస్. లైఫ్ ఓ సర్కిల్. ఈ ముగ్గురు నా కోసం చేస్తున్న పనికి కృతజ్ఞతలు. ప్రతీసారి ఏదో కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. నా జీవితంలో ఈ ముగ్గురు పిల్లర్స్ గా వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను` అని చేసిన పోస్ట్ మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒకరకంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మూడోతరం స్టార్ వస్తున్నాడు! అన్నది కూడా నమ్రత ఉద్ధేశం కావొచ్చు. మూడవ తరం వారసుడు గౌతమ్ దూసుకొస్తున్నాడనడానికి ఇది సంకేతమా? అన్నది తనే చెప్పాలి మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-