క్రియేటివ్ డైరెక్టర్ కొత్త సినిమా మొదలుపెడుతున్నాడా…?

0

క్రియేటివ్ డైరెక్టర్ అనగానే తెలుగు సినీ అభిమానులకు గుర్తు వచ్చేది కృష్ణ వంశీ. ఒకప్పుడు గులాబీ – నిన్నే పెళ్లాడతా – మురారి – ఖడ్గం – చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన కృష్ణ వంశీ ఆ తర్వాత నుండి ఫామ్ కోల్పోయి చాలా పేలవమైన సినిమాలను తీశాడు. ఎప్పుడో 2007 లో తీసిన చందమామ సినిమా తర్వాత అతని నుండి అభిమానులు ఆశించే సినిమా రాలేదు. కానీ ఇప్పటికీ చాలామంది కృష్ణ వంశీ మంచి డైరెక్టర్ అని ఒప్పుకుంటారు. 2017లో రిలీజ్ అయిన ‘నక్షత్రం’ సినిమా తర్వాత కృష్ణ వంశీ ఈ రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా మొదలుపెట్టలేదు.

అయితే ఇప్పుడు ఒక న్యూస్ బయటకొచ్చింది. అతను ప్రస్తుతం తన తర్వాతి సినిమా మొదలుపెట్టబోతున్నాడని తెలుస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్ కథ ఒకటి కృష్ణ వంశీ రాసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ – ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ నటించబోతున్నారని సమాచారం. ఇందులో ప్రధాన పాత్రకి అవికా గోర్ ని తీసుకుంటున్నట్టు సినిమా వర్గాలు చెప్తున్నాయి. ఈ కథకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని – ప్రస్తుతం కృష్ణ వంశీకి ఉన్న మార్కెట్ కంటే బడ్జెట్ ఎక్కువ ఉండడంతో నిర్మాతలు ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారు. కానీ కృష్ణ వంశీ మాత్రం తాను రాసుకున్న కథ మీద నమ్మకంతో ఆ కథనే సినిమాగా తీయాలని ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
Please Read Disclaimer