ప్రభాస్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ.. పెళ్లెప్పుడంటే!

0

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకడు ప్రభాస్‌. అందుకే డార్లింగ్‌ పెళ్లి ఎప్పుడా అని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్‌ స్టార్‌ పెళ్లి విషయంపై ఆయన పెద్దమ్మ, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు సతీమణి స్పందించారు

చాలా రోజులుగా వాయిదా పడుతున్న పెళ్లి

బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్‌ సమయానికే ప్రభాస్‌ పెళ్లి వార్త మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. బాహుబలి పార్ట్‌ 1 రిలీజ్ అయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్‌ స్వయంగా ప్రకటించాడు. ఆ తరువాత కూడా బాహుబలి 2 తరువాత అంటూ మాట మార్చాడు. బాహుబలి 2 రిలీజ్‌ తరువాత పెళ్లి వార్తలపై స్పందించటమే మానేశాడు ప్రభాస్‌. దీంతో అభిమానులు ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలోనూ స్పందించిన కృష్ణంరాజు

గతంలో సీనియర్‌ నటుడు ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు కూడా పెళ్లి విషయంలో పలు ప్రకటనలు చేశాడు. త్వరలోనే ప్రభాస్‌ పెళ్లి ఉంటుందని, అమ్మాయిని వెతికే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారంటూ చాలా సార్లు చెప్పారు. అయితే ఫ్యామిలీ ప్రభాస్‌ పెళ్లి విషయంలో తొందర పడుతున్నా.. ప్రభాస్‌ మాత్రం ఆ విషయంలో పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించటం లేదనిపిస్తోంది.

తాజాగా ప్రభాస్‌ పెద్దమ్మ స్పందించారు

తాజాగా ప్రభాస్‌ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవీ స్పందించారు. `ప్రభాస్‌ పెళ్లి గురించి మేం కూడా ఎదురుచూస్తున్నాం. ఆయన పెళ్లిపై ప్రస్తుతం వస్తున్న వార్తలన్ని పుకార్లు, అవి చూసి మేం నవ్వుకుంటాం. జాన్‌ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. మాది పెద్ద కుటుంబం కావటంతో అందరితో కలిసిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నాం. అలాంటి అమ్మాయి దొరగ్గానే ప్రభాస్‌ పెళ్లి` అన్నారు.

త్వరలో జాన్‌ షూటింగ్‌కు ప్రభాస్‌

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌, ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాల్లో హాలిడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. త్వరలో జాన్‌ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్‌ పెద్దనాన కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.
Please Read Disclaimer