నలుపులో నెవర్ బిఫోర్ అందం

0

కృతి కర్బందా తెలుగులో చాలా సినిమాలలో నటించింది కానీ ఎందుకో బ్రేక్ మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’.. ‘Mr. నూకయ్య’.. ‘ఒంగోలు గిత్త’.. ‘ఓం 3D’ ఇలా సినిమాల లిస్టు మాత్రం పెద్దదే. ఆ తర్వాత కన్నడ.. హిందీ సినిమాలపై ఫోకస్ చేసింది. ఈమధ్య బాలీవుడ్ ఆఫర్లు ఎక్కువగా రావడంతో హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కించే కార్యక్రమంలో బిజీగా ఉంది.

ఈ భామ రీసెంట్ గా ఒక బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒక స్పైసీ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ ధరించిన కృతి దానిపై ఒక బ్లాక్ కలర్ కోటు వేసుకుంది. అయితే సరిగ్గా వేసుకుంటే స్పైసీ ఎలా అవుతుంది? అందుకే బటన్లు ఏమాత్రం పెట్టుకోకుండా అందాలను ఆరేస్తూ.. ఇంకా ఆరబోసేందుకు ఏం మిగిలి ఉన్నాయా అన్నట్టుగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని ఒక పోజిచ్చింది. కృతి మొదటి నుంచే న్యాచురల్ బ్యూటీ. అయితే హాటు ఫోటో షూట్ల వ్యవహారం కాస్త తక్కువే.. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఇలా బాలీవుడ్ స్టైల్లో రెచ్చిపోతోంది. ఇలా చేస్తే కృతి బాగానే ఉంటుంది. ఫోటోలను చూసిన నెటిజన్ల పరిస్థితి ఏం కావాలి?

కృతి ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాల తో బిజీ బిజీగా ఉంది. ‘హౌస్ ఫుల్ 4’.. ‘పాగల్ పంటి’.. ‘చెహ్రే’.. ‘తైష్’ సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో ‘వాన్’ అనే సినిమాను కూడా లైన్లో పెట్టిందని సమాచారం.
Please Read Disclaimer