ఏంటి ఇంత చిక్కిపోయింది!

0

బ్యూటిఫుల్ కృతి కర్బందా దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించింది. కన్నడ.. తెలుగు.. తమిళం.. హిందీ సినిమాలను ఇప్పటివరకూ కవర్ చేసింది. కృతి కర్బందా తెలుగులో ‘తీన్ మార్’.. ‘Mr. నూకయ్య’.. ‘ఒంగోలు గిత్త’.. ‘ఓం 3D’ ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఈమధ్య బాలీవుడ్ లో సెటిల్ అయింది. ఆఫర్లు కూడా వరసగా వస్తున్నాయి. అయితే బాలీవుడ్ భామలు అనగానే జీరో సైజులు ఫిట్నెస్ ఫ్రీకులు కదా. అందుకే సాధారణంగా కనిపించే భామ ఎడాపెడా ఎక్సర్ సైజులు చేసి మరీ చక్కనిచుక్క కాస్తా చిక్కినచుక్కగా మారిపోయింది.

ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కదా. ప్రేమలో ఉన్నవారు.. ఉన్నామని అనుకునేవారు.. ప్రేమికులతో ఈ లోకం నిండిపోవాలని కోరుకునేవారు ప్రేమగా సోషల్ మీడియాలో మెసేజులు పెడుతూ ఉన్నారు. కృతి కర్బందా కూడా అలాగే కొత్త డ్రెస్ వేసుకుని మరీ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి “ఎవరైనా హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పారా?” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో కృతి గ్రీన్ కలర్ చెక్స్ ఉండే టాప్.. సేమ్ డిజైన్ ఉండే ప్యాంట్ ధరించి చేతులతో లవ్ సింబల్ పెట్టింది. ఇక మరో ఫోటోలో ఫుల్లుగా నవ్వుతూ పోజిచ్చింది.

ఫోటోలు.. నవ్వులు.. లవ్వు సింబలు.. అన్ని ఓకే కానీ కృతి మునుపటి కంటే చిక్కిపోయింది. గతంలో చూసేందుకు ముద్దుగా కనిపించే భామ కాస్తా ఇప్పుడు బక్క చిక్కిన చందమామలాగా కనిపిస్తోంది. ఈ జీరో సైజు మోజులో పడి ఫేస్ లో ఉండే ఆకర్షణను తగ్గించుకుంటోందని కృతి అభిమానులు వాపోతున్నారు. ఈ జీరో సైజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన వాడి జిమ్మడ.. వాడి కుడిచెయ్యి పడిపోనూ.. అంటూ మాసుగా తిట్టుకుంటున్నారు. అయినా ఈ హాటు భామలు వెయిట్ విషయంలో ఎవ్వరిమాటా వినరు. ఈ సంగతి పక్కన పెట్టి కృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘మిమి’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer