తీన్ మార్ బ్యూటీ టూ హాట్

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `తీన్ మార్` చిత్రంలో నటించింది కృతి కర్భంద. సుమంత్.. కళ్యాణ్ రామ్ లాంటి స్టార్ల సరసన నటించింది. అటుపై చరణ్ `బ్రూస్ లీ` చిత్రంలో సిస్టర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే కృతి ఎంతగా ప్రయత్నించినా టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు.

ఆ క్రమంలోనే బాలీవుడ్ సహా తమిళం- కన్నడ పరిశ్రమల్లో బిజీ అయ్యింది. హిందీ పరిశ్రమలో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. కృతి నటించిన భారీ మల్టీస్టారర్ `హౌస్ ఫుల్ 4` త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కిలాడీ అక్షయ్ కుమార్- రానా- పూజా హెగ్డే వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనే పాగల్ పానీ.. చెహ్రే లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అనీల్ కపూర్- జాన్ అబ్రహాం- అర్షద్ వార్షీ లాంటి స్టార్లతో కలిసి `పాగల్ పానీ` లాంటి భారీ చిత్రంలో కృతి నటిస్తోంది. ఇక వీటితో పాటే తమిళంలో `వాన్` అనే చిత్రంలోనూ నటిస్తోంది. దుల్కార్ సల్మాన్ – కళ్యాణి ప్రయదర్శిని ఈ చిత్రంలో నాయకానాయికలు. కృతి ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. టైస్ అనే మరో చిత్రానికి సంతకం చేసింది.

మరోవైపు నిరంతరం ఫోటోషూట్లతోనూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటోలో ఇన్ వోర్ ధరించి కృతి ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది. 40లక్షల మంది అభిమానులు తనని అనుసరిస్తున్నారు. ఈ మైలురాయిని అందుకున్న సందర్భంగా ఇలా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిచ్చింది కృతి. మొత్తానికి టాలీవుడ్ కి దూరమైనా ఫ్యాన్స్ కి ఏమాత్రం దూరం కాకుండే టెక్నిక్ కృతి దగ్గర ఉందని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇటీవలే చార్లెస్ అండ్ కీత్ వెడ్డింగ్ కలెక్షన్స్ బ్రాండ్ కి సంతకం చేసింది కృతి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Please Read Disclaimer