బ్రైడ్స్ టుడే కోసం ఝకాస్ పోజు

0

మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’.. నాగ చైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. హిందీలో టైగర్ ష్రాఫ్ తో ‘హీరోపంటి’ తో తన బాలీవుడ్ జర్నీ మొదలు పెట్టి ఏడెనిమిది సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా చేతిలో ఫుల్లుగా ఆఫర్లు ఉన్నాయి. ఈ జెనరేషన్ భామల్లాగే కృతి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సోషల్ మీడియాఖాతాల ద్వారా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

తాజాగా కృతి ‘బ్రైడ్స్ టుడే’ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలాని డిజైన్ చేసిన వధువు వస్త్రధారణతో ఎంతో గ్రేస్ తో పోజులిచ్చింది. మెరూన్ కలర్ లో ఉన్న ఛోళి.. లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్న లెహంగా తో పాటు ఒక చున్నీ ధరించి.. ఫుల్ గా ఆభరణాలు ధరించి నాజూకుగా కనిపిస్తోంది. నడుముకు పెట్టుకున్న ఒడ్డాణం కూడా ఎంతో అందంగా ఉంది. తన డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా అందంగా ఉండే ఆభరణాలను ధరించడంతో కృతి మరింత అందంగా కనిపిస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “రియల్ క్వీన్ లా ఉన్నావు”.. “నీలాంటి అమ్మాయి కనిపిస్తే వెంటనే వెళ్ళి చేసుకుంటా”.. “సో బ్యూటిఫుల్.. పెళ్ళెప్పుడు?” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఇక కృతి సినిమాల విషయానికి వస్తే ‘హౌస్ ఫుల్ 4’.. ‘పానిపట్’ చిత్రాలలో నటిస్తోంది.
Please Read Disclaimer