హౌస్ ఫుల్ పాప దీపావళి ధమాకా

0

కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న భామే. పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ లో హీరోయిన్ గా నటించింది. ఇదొక్కటే కాదు మరో అరడజను సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా బ్రేక్ రాలేదు. ఈమధ్య బాలీవుడ్ ఆఫర్లు ఎక్కువగా రావడంతో అక్కడే మకాం వేసింది. ఈ రోజు రిలీజ్ అయిన ‘హౌస్ ఫుల్ 4’ లో కృతి ఒక హీరోయిన్. దీంతో ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

ప్రమోషన్ కార్యక్రమాల కోసం చక్కగా రెడీ అవ్వడమే కాకుండా ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలలో కృతి సింగిల్ స్లీవ్ ఉండే ఒక టీ షర్టు.. ఒక షార్ట్ స్కర్టు ధరించి స్టైలిష్ పోజులిచ్చింది. అందాల విందు లేదు కానీ సూపర్ మోడల్ తరహాలో కనిపిస్తోంది. మొదట్లో కాస్త చబ్బీగానే ఉన్న ఈ భామ బాలీవుడ్ లో బిజీ అయిన తర్వాత జీరో సైజ్ కు మారింది. సూపర్ మోడల్ లా కనిపించడానికి అదే కారణం.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందనే దక్కింది. “సూపర్ హాట్ మోడల్”.. “దీపావళి ధమాకా”.. “స్టన్నింగ్ డ్రెస్” అంటూ కామెంట్లు పెట్టారు. కృతి ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ‘పాగల్ పంటి’.. ‘చెహ్రే’.. ‘తైష్’ సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో ‘వాన్’ అనే సినిమాకు సైన్ చేసిందని టాక్.
Please Read Disclaimer