ఫ్రంటేమో పెద్దాపురం.. బ్యాకేమో పిఠాపురం!

0

`1 నేనొక్కడినే` బ్యూటీ కృతి సనన్ ఇస్పీడ్ గురించి తెలిసిందే. యువహీరోలతో డేటింగులు .. వీకెండ్ లో టెంపరేచర్ పెంచే వ్యవహారాలు ప్రతిదీ సెన్సేషనే. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో చెలరేగుతున్న ఈ అమ్మడు తాజాగా పిఠాపురం ప్రిన్సెస్ రేంజులో ముస్తాబై అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేలా చేసింది. బ్రైట్ వెల్వెట్ గ్రీన్ బాల్ గౌన్ లో తళాంగు తళుకులు ప్రదర్శించింది. లైట్ లిప్ కలర్ తో కత్తిలాంటి చూపులతో కుర్రకారు గుండెల్ని గుచ్చేస్తోంది. డిఫరెంట్ భంగిమల్లో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఇక తన గౌన్ ఫ్రంట్ వీ షేప్ తో అదరగొట్టేసింది. ఇక బ్యాక్ `యూ` షేప్ తోవీపు అందాల్ని చూపిస్తూ హీట్ పుట్టిస్తోంది. ఈ వేడెక్కించే గ్లామరస్ లుక్ ని సోషల్ మీడియా ఫ్యాన్స్ తో పంచుకుంటూ `అందమంతా ఆ సొగసులోనే ఉంది` అన్న హింట్ ఇచ్చింది.

తాజా ఫోటోలు ప్రస్తుతం వెబ్ లో వైరల్ గా మారాయి. కృతి కాన్ఫిడెన్స్ .. ఆ సూదంటు చూపులు ఫ్యాన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. చిలిపితనం- కొంటెతనం- మైకం- విరహం ఇన్ని రకాలుగా తన లుక్ మురిపిస్తోంది. అందుకే ఆ ఫోటోల నుంచి నెటిజనం చూపు తిప్పుకోలేకపోతున్నారని చెప్పాలి. అంతేకాదు కృతి అందాలను వర్ణిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో హాట్ లుక్స్ అంటే.. మరికొందరు సెక్సీ లుక్.. బ్యూటీఫుల్ ఐస్ .. సెక్సీ లుక్ లవ్లీ ఐస్ అంటూ పొగిడేస్తున్నారు. కొందరు ఆల్కాహాలిక్ ఐస్ అంటూ ప్రశంసించడం ఆసక్తికరం. ఇలాంటి అందమైన గిఫ్ట్ లు మరిన్ని కావాలి అంటూ నెటిజనులు కృతిని కోరుతున్నారు.

గతేడాది `హౌస్ఫుల్ 4`- `పతి పత్నీ ఔర్ వాహ్` చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కృతి ఈ ఏడాది `ఆంగ్రేజ్ మీడియం`లో ‘కుడి ను నచ్నే డే’ అనే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇందులో ఆమె డాన్సులకు.. కవ్వించే లెగ్ మూవ్మెంట్స్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. స్పెషల్ సాంగ్స్ వరకే పరిమితమైన కృతి హీటు పుట్టిస్తోందంటూ అభిమానులు కామెంట్లు గుప్పించడం ఆసక్తికరం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ `మిమి` అనే చిత్రంలో నటిస్తోంది. లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అద్దె గర్భం ప్రధానంగా సాగుతుండగా.. ఇందులో కృతి సర్రోగసీ మదర్ గా నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్టుతో సాగే ఈ సినిమా జులైలో విడుదల కానుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-