ఫుల్ గా ఎగ్జైట్ అయిన కృతి!

0

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తెలుసు కదా. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక హిందీలో టైగర్ ష్రాఫ్ తో ‘హీరోపంటి’ తో తన బాలీవుడ్ జర్నీ మొదలు పెట్టి చాలానే సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా చేతిలో ఫుల్లుగా ఆఫర్లు ఉన్నాయి. ఈ జెనరేషన్ భామల్లాగే కృతి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ట్విట్టర్.. ఇన్స్టా ఖాతాల ద్వారా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

తాజాగా కృతి తన ఇన్స్టా ఖాతా ద్వారా తన స్నేహితురాలు అయేషా అహ్మద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పది ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఒక వీడియో కూడా ఉంది. ఆ సెల్ఫీ వీడియోలో అయేషా ఫుల్ కిక్ లో ఒక ఇంగ్లీష్ పాటకు అనుగుణంగా మంచి రిథంతో డ్యాన్స్ చేస్తూ ఉంది. ఈ ఫోటోలకు కృతి ఇచ్చిన క్యాప్షన్ “హ్యాపీయస్ట్ బర్త్ డే అయిషూ.. మన పరిచయం జరిగి ఆరేళ్లయింది..నమ్మలేకుండా ఉన్నాను. నీకు తెలుసు కదా.. నువ్వు నాకు అక్కలాంటిదానివి. ‘హీరోపంటి’ సమయంలో నాకు షాపింగ్ లో సహాయం చేయడం దగ్గర నుండి నా జీవితంలో ప్రతి అడుగులో నువ్వు నా పక్కనే ఉన్నావు. నాకేం కావాలో నీకు తెలుసు. నా మనసులోని విషయాలు నీకు ఏం దాచిపెట్టకుండా చెప్పుకోగలను. నువ్వు నాకు పార్టీ పార్ట్నర్. నీకు ఈ ప్రపంచంలో ఉండే సంతోషాలన్నీ నీకు దొరకాలి. ఇంకా.. నీ జీవితంలో ఒక అద్బుతమైన అందమైన అబ్బాయి నిన్ను చాలా ప్రేమించే అబ్బాయి కూడా ఉన్నాడు కదా! నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను” అంటూ తన అభిమానం.. ఆప్యాయత.. ప్రేమ.. స్నేహం అన్నీ తన ఫ్రెండ్ పై కురిపించింది.

ఒక ఫోటోలో తన ఫ్రెండ్ కుప్రేమగా ముద్దు కూడా ఇచ్చింది. ముద్దులో చాలా రకాలు ఉన్నాయి కదా. ఇది చీక్ కిస్ అంటే.. జస్ట్ ఫ్రెండ్ షిప్ ముద్దు. ఈ అయేషా కృతి సనన్ కు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు.. మేనేజర్ కూడా. అయేషా పలువురు బాలీవుడ్ స్టార్లకు సెలబ్రిటీ మేనేజర్. అందుకే కృతి సనన్ ను అంత జాగ్రత్తగా చూసుకుంటోంది.Please Read Disclaimer