బాలీవుడ్ లో బెస్ట్ బెల్లీ బటన్

0

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మాహేష్ బాబు ‘1 నేనొక్కడినే’.. నాగ చైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో తెలుగులో కూడా గుర్తింపు ఉంది. అయితే టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లభించకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తోంది. ‘హీరోపంటి’.. ‘బరేలీ కి బర్ఫీ’.. ‘లూకా చుప్పి’ లాంటి ఓ అరడజన్ కు పైగా సినిమాల్లో నటించింది. ఈభామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.

కృతి తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజిపై మెరిసింది. ఈ సంచికలో ‘రెడ్ హాట్ షో గర్ల్: కృతి సనన్’ అనే కథనం కూడా ప్రచురించారు. ఇక ఫోటో విషయానికి వస్తే మెంతి రంగు ఫుల్ స్లీవ్స్ షర్టు.. సేమ్ కలర్ ప్యాంట్ ధరించి యమా హాటు పోజిచ్చింది. రెండు చేతులతో తన శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా ఓ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అయితే ఈ ఫోటోలో హైలైట్ మాత్రం కృతి నాభి అందాలే. అసలే జీరో సైజ్ బ్యూటీ కావడంతో నడుము సన్నజాజి తీగ లాగా కనిపిస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “రియల్ క్వీన్ లా ఉన్నావు”.. “ఫిలింఫేర్ ఆన్ ఫైర్”.. “బాలీవుడ్ లో బెస్ట్ బెల్లీ బటన్”.. “ఎల్లో డ్రెస్ లో రెడ్ హాట్ బ్యూటీ” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఇక కృతి సినిమాల విషయానికి వస్తే ‘హౌస్ ఫుల్ 4’.. ‘పానిపట్’ చిత్రాలలో నటిస్తోంది.
Please Read Disclaimer