నాని…మారుతి సినిమా కన్ఫర్మ్ చేసిన నిర్మాత

0

కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులకే కాదు నిర్మాతలకు కూడా స్పెషలే. అవును ఆ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తే చూద్దామని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే ఆ కాంబోలో సినిమా నిర్మించి డబ్బులు దండుకుందామని నిర్మాతలు చూస్తుంటారు. అయితే అలాంటి సూపర్ హిట్ కాంబోలో సినిమా తీయాలని చూస్తున్నాడు బడా నిర్మాత కే.ఎస్.రామారావు.

అవును ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసిన క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్ లో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి సూపర్ హిట్ కొట్టిన మారుతి -నాని లు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా ఓ ఇంటర్వ్యూ చెప్పుకున్నాడు. ఇప్పటికే అంతా రెడీ అయిందని అతి త్వరలోనే ఆ కాంబోలో మా సినిమా ఉంటుందని అన్నారు.

ప్రస్తుతం శివ నిర్వాణతో ‘టక్ జగదీశ్’ చేయబోతున్న నాని నెక్స్ట్ ‘టాక్సీ వాలా’ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండూ పూర్తయ్యే సరికి ఏడాది గడిచిపోతుంది. ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నాడు. మారుతి కూడా నిర్మాత దానయ్య అబ్బాయిను హీరోగా పరిచయం చేసే భాద్యతను తీసుకుంటున్నాడు. సో ఇద్దరూ బిజీగానే ఉన్నారు. మరి ఈ కాంబోలో రామారావు గారు సినిమా నిర్మించేదెప్పుడో వేచి చూడాలి.
Please Read Disclaimer