లాభం ట్రైలర్: సేతుపతి వర్సెస్ జగపతి

0

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తాజా చిత్రం `లాభం`. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ ఎస్.ఫై.జననాదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం వ్యవసాయం.. రైతు కుటుంబం నేపథ్యం ఆద్యంతం రక్తి కట్టిస్తోంది.

తాజాగా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. సోషల్ మెసేజ్ తో పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారని అర్థమవుతోంది. ముఖ్యంగా రైతన్నగా కనిపిస్తున్న విజయ్ సేతుపతికి జగపతిబాబుకు మధ్య ఠగ్ ఆఫ్ వార్ .. మైండ్ గేమ్ నేపథ్యంలో రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో మూవీని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే చెబుతోంది.

ట్రైలర్ లోని సేతుపతి లుక్ పంచెకట్టు విలేజ్ రైతన్న స్టైల్ ఆకట్టుకున్నాయి. అలాగే ప్రధాన పాత్రలకు తగ్గట్టే డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీకి శృతి హసన్ గ్లామర్ ప్రధాన అస్సెట్ కానుంది. కొంత గ్యాప్ తర్వాత శ్రుతి ఎంతో శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇదని అర్థమవుతోంది. కలై అరసన్.. పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.