రౌడీ లేడీ ఫ్యాన్స్ తో బౌన్సర్లకే చెమటలు!

0

రౌడీ విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. అర్జున్ రెడ్డిగా ఎప్పటికీ గాళ్స్ గుండెల్లో నిలిచిపోయాడు. ముఖ్యంగా ఆ సినిమాతో అతడికి లేడీ ఫ్యాన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. గీత గోవిందంతో ఆ ఫాలోయింగ్ కాస్తా మరింత పీక్స్ కి చేరుకుంది. అసలు విజయ్ నటనకు మంత్రముగ్ధం కానివాళ్లు లేనేలేరు. టీనేజర్స్ తో పాటు యంగ్ లేడీస్ అయితే అతడంటే పడి చస్తున్నారు.

అందుకు ప్రూఫ్ ఏదీ? అంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ దగ్గర తోపులాటలే అందుకు సాక్ష్యం. అక్కడ డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ ని వీక్షించేందుకు భారీ ఎత్తున దేవరకొండ మహిళా ఫ్యాన్స్ వచ్చారు. ఆడిటోరియంలోకి వెళ్లక ముందే గేట్ బయట ఆపేయడంతో పెద్ద రుబాబ్ నడిచిందక్కడ. ఇక ఇన్ సైడ్ కి వెళ్లిన లేడీ ఫ్యాన్స్ తో బౌన్సర్లకు కూడా చిక్కులు తప్పలేదు. అదుపు చేయలేక నానా తంటాలు పడ్డారు బాడీ బిల్డర్లు. అసలు రౌడీ బోయ్ ఎప్పుడు దిగుతాడు? అన్న ఆత్రం అక్కడ ఉన్న టీనేజీ గాళ్స్ లో కనిపించింది. ఓ వైపు బౌన్సర్ల నస భరించలేక చికాకు పడిన వాళ్లు ఉన్నారు. మొత్తానికి ఈ ఈవెంట్ రౌడీ కి ఉన్న లేడీ ఫాలోయింగ్ ని మరోసారి అందరికీ ఎలివేట్ చేసిందనే చెప్పాలి.

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జంటగా నటించిన `డియర్ కామ్రేడ్` (ఫైట్ ఫర్ వాట్ యు లవ్) ప్రచారార్భాటం తెలిసిందే. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్- బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని- యలమంచిలి రవిశంకర్- మోహన్ చెరుకూరి(సి.వి.ఎం)- యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. సెన్సార్ నుంచి యుఎ సర్టిఫికేట్ దక్కింది. జూలై 26న తెలుగు – తమిళ – మలయాళ – కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. మ్యూజిక్ ఫెస్టివల్స్ పేరుతో అన్ని మెట్రోల్ని చిత్రయూనిట్ చుట్టేసిన సంగతి తెలిసిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home