లేడీ సూపర్ స్టార్ కి రాచమర్యాద

0

సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్ స్టార్! ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్ లోని లైవ్ దృశ్యమిది. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో నటిస్తుంటే ఆన్ లొకేషన్ సన్నివేశం ఎలా ఉంటుందో ఇదిగో ఈ సన్నివేశం చూసి చెప్పొచ్చు. ఒక రకంగా అనీల్ రావిపూడి ఏరి కోరి వెంటపడి మరీ సీనియర్ నటి విజయశాంతిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అందుకు తగ్గట్టే తనకు మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నారో ఈ లీక్డ్ ఫోటో చూస్తేనే అర్థమవుతోంది. ఏదో ఇండోర్ లో సీన్ ఇది.

సూపర్ స్టార్ మహేష్ ఓవైపు అక్కడ వేసిన సోఫాలో జేరబడి చాలా సాధాసీదాగానే అందరితో కలిసిపోయి కనిపిస్తుంటే.. అంత మంది జనంలో లేడీ సూపర్ స్టార్ కోసం ప్రత్యేకించి ఒక డిజైనర్ ఛైర్ వేసి దానిపై తెల్లని క్లాత్ తో కప్పి ఆశీనులయ్యేలా ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. విజయశాంతి మ్యాడమ్ కి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఇచ్చిన ఆ గౌరవాన్ని పొగిడి తీరాల్సిందే.

పరిశ్రమలో ఆడవాళ్లకు గౌరవం లేదు అని విమర్శించేవాళ్లందరికీ ఇది చెంప పెట్టు లాంటిది. టాలీవుడ్ ఎంతో సెక్యూరిటీ ఉన్న పరిశ్రమ. ఇక్కడ ఆడాళ్లకు రక్షణ మాత్రమే కాదు గౌరవం కూడా ఉంటుందనడానికి ఈ ఫోటోనే ఎగ్జాంపుల్. మోస్ట్ పవర్ ఫుల్ లేడీ సూపర్ స్టార్ శాంతమ్మ ఎంతో ఠీవిగా ధీమాగా కనిపిస్తున్నారు అక్కడ. తన స్థాయికి తగ్గ గౌరవాన్ని అందుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి పాత్రలో నటిస్తున్నారు. రీఎంట్రీలో ఎలా కనిపించనున్నారు? అన్నదానికి ఇటీవలే ఫస్ట్ లుక్ ఆన్సర్ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరు రిలీజవుతోంది.
Please Read Disclaimer