మెగాస్టార్ సైరా పై లేడీ సూపర్ స్టార్ ఫైర్ ….కారణం ఇదేనా ?

0

సైరా నరసింహారెడ్డి .. మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ చిత్రం. అలాగే చిరు పదేళ్ల పాటు కలలు కన్న చిత్రం. రాజకీయ ప్రవేశం చేయకముందు ఈ రేనాటి వీరుడి కథని పరుచూరి బ్రదర్స్ చిరుకి సరిగ్గా సరిపోతుంది అని భావించి ఆయనకి వినిపించారు. కానీ అప్పుడు చిరు రాజకీయాలపై ఆసక్తితో ఈ సినిమాని పక్కన పెట్టి .. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో చిరు రాజకీయాలన్నీ పక్కన పెట్టి .. తిరిగి వెండితెరపై కి రీఎంట్రీ ఇచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెంబర్ 150 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాతో చిరు ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు అని తెలిసింది. దీనితో డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా సినిమా లో నటించాడని ఇదే సరైన సమయం అని భావించి ఈ సినిమాని పట్టాలెక్కిన్చారు.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 100 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపేసింది. ఇకపోతే ఈ విషయం కాసేపు పక్కన పెడితే ..ఈ సినిమాలో నరసింహారెడ్డి భార్యా పాత్రలో నయనతార నటించగా .. ప్రేమికురాలి పాత్ర అయిన లక్ష్మి పాత్రని తమన్నా చేసింది. అయితే సైరా ఫలితం ఎలా ఉన్నా అందులో నయనతార కన్నా తమన్నా పాత్రే ఎక్కువ సేపు ఉండడం ఇప్పుడు నయనతారకు ఆగ్రహం కలిగిస్తుంది అని తెలుస్తుంది.

ముందునుండి అందరూ తమన్నా పాత్ర కాసేపు ఉంటుంది అని భావించారు. అయితే సైరా సినిమా విడుదలయ్యాక సినిమాలో నయన్ పాత్ర కన్నా తమన్నా పోషించిన లక్ష్మి పాత్ర హైలెట్ అవ్వడం .. అలాగే నయనతార కన్నా ఎక్కువగా తమన్నా పాత్రకి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం వలనే నయనతార సైరా ప్రమోషన్స్కి రాలేదనే ప్రచారం జరుగుతుంది. కానీ మెయిన్ హీరోయిన్ అని తనకి చెప్పి ..అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ పాత్రని ఇచ్చారని చిత్ర యూనిట్ పై ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా తమన్నా గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప నయనతార పాత్ర గురించి కనీసం ఒక్కరు కూడా మాట్లాడుకోవడంలేదు. అందుకే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. మాములుగా ఏ సినిమా ప్రమోషన్స్ కి కూడా నయనతార కనిపించదు.