ఎర్రబికిని ఎర్రబికిని ఎన్నియల్లో!

0

హీరోయిన్ గా సినిమాలు చేయడంతో పాటుగా స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే బ్యూటీ రాయ్ లక్ష్మి. ఈ ఘాటు భామకు సౌత్ అంతా గుర్తింపు ఉంది. హిందీలో కూడా ‘జూలీ 2’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది కానీ ఐటెం బ్యూటీగానే ఎక్కువ పాపులర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం. 150’ లో రత్తాలు రత్తాలు పాటలో డ్యాన్స్ చేయడంతో భారీగా గుర్తింపు దక్కింది. ఈ రత్తాలుకు ఒక క్రేజీ హాబీ ఉంది.

అదే సోషల్ మీడియాలో తన హాటు ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేసి వీలైనంతగా భూగోళ తాపం పెంచడం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అదేపని చేసింది. ఆ ఫోటోకు “నేను అమితంగా ఇష్టపడేది ఏంటో తెలుసా? ప్రయత్నం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే జీవితంలో ఏది సాధించాలన్నా దానికి తగిన ప్రయత్నం చేయాలి. ఆఖరికి ఈ ఫోటో స్టొరీలు చదవాలన్నా సైట్ ఓపెన్ చేసి.. అర్టికల్ లింక్ ఓపెన్ చేసి చదవాలి. లేకపోతే ఫోటో లేదు.. స్టొరీ లేదు. ఫోటోస్టొరీ అంతకన్నా లేదు. మంచి క్యాప్షనే ఇచ్చింది మన రత్తాలు. ఈ క్యాప్షన్ల సంగతేమో కానీ రెడ్ కలర్ మోనోకినిలో ఒక స్విమ్మింగ్ పూల్ లో నిలబడి ఖజురహో శిల్పంలా పోజిచ్చింది. ఆ ఒంపుసొంపులు చూస్తే కరుడుగట్టిన కఠోరమైన సన్యాసి కూడా మనలాంటి సంసారిగా మారిపోతాడు. ఇక ఈ మోనోకినిని డిజైన్ చేసిన గురుడు ఎవరో కానీ అతడికి ఆడి కారంటే ఎంతో ఇష్టం అనుకుంటా. ఆడి రింగులను ఒకదానిపై ఒకటి కాకుండా రెండు రెండు మిల్లీ మీటర్ల గ్యాప్ లో పక్కపక్కనే పెట్టి.. రాయ్ గారి నాభి అందాల ప్రదర్శన లేని లోటును తీర్చేశాడు.

నెటిజనులు ఈ ఎర్రబికినితో వెర్రెత్తిపోయారు. “రెడ్ హాట్ బేబీ”.. “క్లాసిక్ పోజ్.. కిల్లింగ్ లుక్స్”.. “అందాల దేవత”.. “ఎర్ర మిరపకాయ్” అంటూ డిఫరెంట్ కామెంట్లు పెట్టారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’ అనే చిత్రంలోనూ.. కన్నడలో ‘ఝాన్సి’ అని మూవీలోనూ నటిస్తోంది.