ఇదుగో భారతరత్న లతాజీ

0

గత నెలలో భారతరత్న జాతి గర్వించదగ్గ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలు ప్రసారం చేస్తే ఒకటి రెండు మీడియా సంస్థలు లతాజీ చనిపోయారంటూ కూడా వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ వార్తలను నిజం కాదంటూ ఆ ఛానల్స్ మళ్లీ అనారోగ్యం అంటూ కథనాలు ప్రసారం చేశాయి. దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి చికిత్స పొందిన లతాజీ ఎట్టకేలకు డిశ్చార్జ్ అయ్యారు.

లతాజీ ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఆమెకు ఇన్ని రోజులు పూర్తి డెడికేటెడ్ గా డ్యూటిలో ఉండి ఆమెకు సేవ చేసిన ముగ్గురు సిస్టర్స్ లతాజీ డిశ్చార్జ్ అయిన సందర్బంగా ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇన్ని రోజులు లతా జీ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా ఈ ఫొటోతో పుకార్లే అని తేలిపోయింది. లతా జీ ఆరోగ్యం బాగానే ఉందని ఈ ఫొటో చూస్తేనే అర్థం అవుతుంది. ఇదే సమయంలో లతాజీ తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
Please Read Disclaimer