పూరికి ఈ స్మార్ట్ సక్సెస్ సరిపోదా ?

0

రామ్ ను మొదటిసారి ఊర మాస్ అవతారంలో చూపించడమే కాక ఈ ఏడాదిలో చాలా కాలంగా సరైన మసాలా సినిమా లేని కొరతను తీర్చిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని పూరి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ముందే ప్లాన్ చేసుకున్న ట్రిప్ కావడం వల్ల హీరో రామ్ అందుబాటులో లేనప్పటికీ టీమ్ ను తీసుకుని తనే ఊరూరా ట్రిప్పులు కొట్టేస్తున్నాడు. సరే ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు హీరోల నుంచి నిర్మాతల నుంచి వరసగా కాల్స్ ఆఫర్స్ రావడం సహజం. మరి పూరికి అలాంటివి ఎన్ని వచ్చాయి అనే ఆసక్తి అభిమానుల్లో కలగడం సహజం.

ఎవరు పూరితో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో జనగణమన ఉంటుందనే ప్రచారం ఓ రెండు రోజులు జోరుగా జరిగింది కానీ అలాంటిది ఏదైనా ఉంటే తనే స్వయంగా చెబుతానని హీరో స్వయంగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో దానికి చెక్ పడిపోయింది. ఇక ఇప్పుడు ఏ హీరోతో పూరి చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. డబుల్ ఇస్మార్ట్ అని సీక్వెల్ ప్రకటించాడు కానీ రామ్ వెంటనే ఒప్పుకోకపోవచ్చు. ఆల్రెడీ పెదనాన్న రవి కిషోర్ బ్యానర్ లో తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయిపోయాడు.

సో అది అయ్యాక మళ్ళీ మేకోవర్ చేసుకుని ఇస్మార్ట్ శంకర్ గా మారాలంటే టైం పట్టొచ్చు. ఆ లోగా పూరికి ఇంకెవరైనా స్టార్ హీరో దొరుకుతాడా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఏదో మాస్ సినిమాల కరువులో ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయ్యింది కానీ ఇలాంటి హీరో క్యారెక్టరైజేషన్లతో ఎంత మేరకు వర్క్ అవుట్ చేసుకోగలం అనే దాని గురించి హీరోలు ఆలోచించకుండా పోరు. కాబట్టి ఇదంతా తేలడానికి కొంత టైం అయితే పట్టేలా ఉంది. ఈలోగా ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ రన్ పూర్తవుతుంది కాబట్టి పూరి స్టామినా మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది
Please Read Disclaimer