రజనీకాంత్ రాజకీయనాయకుడు కాదట..!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’ తర్వాత ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాను చేసేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అందరూ #తలైవర్166 గా పిలుచుకుంటున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. తాజాగా ఈ సినిమా గురించి కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో రజనీ డబల్ రోల్ లో నటిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. రజనీ చాలా ఏళ్ళ తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని అన్నారు. అది నిజమేనట. ఒక పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందట. కానీ రెండవ పాత్రలో ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని అన్నారు. కొంతమంది ఇంకా ముందుకెళ్ళి రజనీ తమిళనాడు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తాడని అన్నారు. కానీ అవేవీ నిజం కాదని.. ఒక సోషల్ యాక్టివిస్ట్ పాత్రలో రజనీ కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సమాజసేవకుడి పాత్రలో రజనీ ఏ ఇష్యూ పై పోరాడతాడనేదిమాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. గతంలో మురుగదాస్ సినిమా ‘కత్తి’ లో హీరో దొంగ – సమాజసేవకుడు పాత్రలలో విజయ్ కనిపించాడు. ఇప్పుడు మురుగా తన తాజా చిత్రం కోసం పోలీస్ – సమాజసేవకుడు డబల్ రోల్ ఫార్మాట్ సెట్ చేసుకున్నాడన్నమాట.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రజని-మురుగదాస్ కాంబినేషన్ లో మొదటిసారి సినిమా తెరకెక్కుతుండంతో సూపర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Please Read Disclaimer