‘దర్బార్’ సెట్స్ లో ప్రేమజంట

0

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వెండితెరపై ఏ రేంజ్ లో హంగామా చేస్తారో రియల్ లైఫ్ లోనూ అంతే జోవియల్ పర్సనాలిటీ అని సన్నిహితులు చెబుతారు. రజనీ చాలా అల్లరిగా.. చిలిపిగా వ్యవహరిస్తుంటారట. అతడి వ్యక్తిగత క్వాలిటీని తెరపైనా చూపించారు దర్శకులు. రజనీ నటిస్తున్న తాజా చిత్రం `దర్బార్` సెట్స్ లో ఆ సీన్ రిపీటైంది.

ఈ సినిమా సెట్ లో రజనీ తన సతీమణి లతతో కలిసి ఓ ఫొటోకి పోజిచ్చారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. చిత్రీకరణ విరామ సమయంలో రజనీ చైర్ లో కూర్చుని రిలాక్స్ అవుతుండగా ఆయనపై చేతులు వేసి భార్య లత నిలుచుని కనిపిస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది.

చాలా ఏళ్ల తరువాత ఇలా ఇద్దరూ కలసి కనిపించడంతో సెట్ లో వున్న ఓ వ్యక్తి కెమెరాకు పని చెప్పాడు. ఈ ఫొటో ఒక్కటే అయినా అందులో ఎన్నో భావాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వున్న అపారమైన ప్రేమ కనిపిస్తోంది. ఒకరంటే ఒకరికి వున్న లవ్.. ఎఫెక్షన్ స్పష్టంగా అర్థమవుతోంది. కాలేజ్ మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లత రంగాచారి మనసులు కలవడంలో లత రజనీకాంత్(లతా శివాజీ గైక్వాడ్)గా మారిపోయారు. 1980లో రజనీ ఓ తెలుగు సినిమా చిత్రీకరణలో బిజీగా వున్నారు. అదే సమయంలో తన ఇంటర్వ్యూ కోసం లత వెళ్లారట. తొలి చూపులోనే ప్రేమలో పడిన రజనీ పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని బలంగా ఫిక్సయ్యారట.

వెంటనే తన ప్రపోజల్ ని ఆమెకు రజనీ అక్కడే చెప్పేశాడట. ఆ విషయం పెద్దల వరకు వెళ్లడం.. వారు కూడా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రజనీ.. లతని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలతో హ్యాపీగా వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. 38 ఏళ్ల వీరి వైవాహిక జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. అయినా ఒకరంటే ఒకరికి వున్న అభిమానం ఇంత కూడా తగ్గలేదు. పెరిగింది. దానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ ఫొటో.
Please Read Disclaimer