డిప్రెషన్ తో మద్యం..డ్రగ్స్ కు బానిసైందట!

0

బాలీవుడ్ మూవీ ‘ఏబీసీడీ’ తో డాన్సర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న లారేన్ గోట్లీబ్. అమెరికాకు చెందిన ఈమెకు ఒక్క సినిమాతోనే మంచి పేరు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈమె సినిమాల్లో ఎక్కువగా నటించలేక పోయింది. చెప్పుకోలేని కష్టాలు కొన్ని వచ్చి ఈమె జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. ఆ ఇబ్బందులు కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది. మద్యం.. డ్రగ్స్ కు బానిసైన ఈమె చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక మీడియా సంస్థ ముందుకు వచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో లారేన్ గోట్లీబ్ షాకింగ్ విషయాలను తెలియజేసింది. రెండు సంవత్సరాల పాటు నరకం అనుభవించాను. ఏబీసీడీ సినిమా సమయంలో నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో నేను నటించిన సీన్స్ ను తొలగించడంతో పాటు నన్ను ప్రమోషన్స్ కు దూరంగా ఉంచారు. దాంతో పాటు నేను అందరిని నమ్మాను. కాని నన్ను చాలా మంది మోసం చేశారంది. గతంలో నేను ఇండియా నుండి అమెరికాకు వెళ్లే సమయంలో కన్నీళ్లు పెట్టుకునేదాన్నంటూ చెప్పుకొచ్చింది.

నేను ఎంత నిజాయితీగా ఉన్నా చాలా మంది నాతో అబద్దాలు చెప్పారు. చాలా మంది చేతిలో మోసపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. ఆ సమయంలో నాకు మద్యం మరియు డ్రగ్స్ మంచి ఔషదాలుగా పని చేశాయి. ఆ రెండేళ్ల పాటు జీవితం మొత్తం నాశనం అయ్యిందనిపించింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుండి బయటకు వస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer