లావణ్య ఫామ్ లోకి వచ్చేసిందోచ్!

0

ఒక హీరో వరుసగా అరడజను ఫ్లాపులు ఎదురైనా అతనికి అవకాశాలు ఉంటాయేమో కానీ హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు. నాలుగు ఫ్లాపులు తగిలితే ఇక హ్యాండ్ బాగు.. ట్రావెలింగ్ సూటుకేసు సర్దుకుని ముంబై ఫ్లైటు ఎక్కాల్సిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా నిన్నమొన్నటివరకూ దాదాపుగా ఇలానే ఉంది. కానీ ‘అర్జున్ సురవరం’ తో ఒక్కసారిగా లావణ్య ఫామ్ లోకి వచ్చేసింది.

‘అర్జున్ సురవరం’ విడుదలకు ముందు లావణ్య నటించిన నాలుగైదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘అర్జున్ సురవరం’ మీద నమ్మకం పెట్టుకుంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండడంతో లావణ్య కూడా నిరాశపడే ఉంటుంది. ఎట్టకేలకు ‘అర్జున్ సురవరం’ నవంబర్ 29 న విడుదలైంది. సినిమాకు మంచి టాక్ తో పాటు డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. నిఖిల్-లావణ్య జోడీ మధ్యలో ఫిజిక్స్ బాగుందని చాలామంది అన్నారు. కాదు కాదు.. అది లవ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ సమీరణాలతో పాటుగా డేరింగ్ డాషింగ్ గా ఉండే విలేఖరి పాత్రలో లావణ్య నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తా అన్నట్టుగా లావణ్య ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉందట. ఈ సినిమాకు చక్కని ఆదరణ దక్కడంతో తనకు మంచి ఆఫర్లు వస్తాయని నమ్మకంగా ఉందట. ఇదే కాకుండా ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య నవ్వును ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకోవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి లావణ్యపై పడిందనడంలో సందేహం లేదు. ఏదైతేనేం.. అందాల రాక్షసి ఫామ్ లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు.
Please Read Disclaimer