అందాల రాక్షసి ఎంత ఆరబోసినా కానీ!

0

వరుసగా నటిస్తున్నా సక్సెస్ లేక డీలా పడిపోయింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. చాలా కాలం తర్వాత మొన్ననే ఓ హిట్ వచ్చింది. నిఖిల్ తో నటించిన అర్జున్ సురవరం విజయం ఊపిరి పోసింది. సెంటిమెంటు పరిశ్రమలో సక్సెస్ తో పాటే ఆఫర్స్ క్యూ కడతాయని అంటారు. హిట్ కాంబినేషన్ చుట్టూ దర్శక నిర్మాతలు పరిగెత్తే ఇండస్ట్రీ కాబట్టి ఆ కోవలో అయినా లావణ్య కు అవకాశాలొస్తున్నాయా? అంటే.. అదీ లేక లావణ్య కంగారులో ఉందట. అందాల రాక్షసి చుట్టూ మేకర్స్ పడతారని అనుకున్నా.. సీన్ పూర్తి రివర్స్ లో ఉంది. లావణ్యకి `అర్జున్ సురవరం` సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క ఆఫర్ ఇవ్వలేదట. తెలుగులో ఈ అమ్మడిని పట్టించుకునే నాధుడే లేడనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

అయితే స్టార్స్ ని.. మేకర్స్ ని ఆకట్టుకునేందుకు లావణ్య స్పీడ్ పెంచేస్తోందని టాక్. అందాల ఆరబోతకు అడ్డు చెప్పనని ఫీలర్స్ వదులుతూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటోందట. నిజానికి ఎక్కువగా సంప్రదాయ బద్ధమైన పాత్రల్లో కనిపించే లావణ్య గత కొంత కాలంగా గ్లామర్ డోస్ పెంచింది. వీలున్నంతవరకూ అందాలను ప్రదర్శిస్తూ ఫోటో షూట్ లు చేస్తోంది. ఇవి సోషల్ మీడియా లో జోరుగానే హల్ చల్ చేస్తున్నాయి.

మరి రాక్షసి అందాలకు ఫిదా అయ్యారో.. లేక ఆమె నటన నచ్చిందో గానీ తమిళంలో ఓ ఆఫర్ ఆమెని వరించింది. అధర్వ మురళీ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చింది. రవీంద్ర మాధవ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా లావణ్య శుక్రవారం ప్రకటించింది. సో ఎగ్జైటెడ్ అంటూ విశ్లేషకులు రమేష్ బాలా పెట్టిన ట్వీట్ ని రీట్వీట్ చేసింది. దీంతో లావణ్య కష్టం ఫలించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య `ఏ1 ఎక్స్ ప్రెస్` చితంలో కథానాయికగా నటిస్తుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హాకీ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హాకీ ప్లేయర్ గా లావణ్య అలరించనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-