ఫ్లాప్ హీరోయిన్ తో నటించడం అచీవ్ మెంట్ ఏంటీ బాసూ?

0

ఆర్ఎక్స్ 100 చిత్ర హీరో కార్తికేయ వరుసగా చిత్రాలు అయితే చేస్తున్నాడు కాని సక్సెస్ లు అయితే దక్కించుకోలేక పోతున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటిస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు తప్ప కమర్షియల్ గా సక్సెస్ లు మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో కార్తికేయ గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక చిత్రం చేయబోతున్నాడు. చావు కబురు చల్లగా అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ కు మాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్లుగా ప్రకటించారు. షూటింగ్ ప్రారంభం అయిన సందర్బంగా కార్తికేయ ట్విట్టర్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. లావణ్య త్రిపాఠితో నటించబోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందాల రాక్షసి సినిమా అప్పటి నుండి కూడా ఆమెను నేను ఒక గొప్ప అభిమానిని. ఇప్పుడు ఆమెతో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో గొప్ప అచీవ్ మెంట్ గా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. కార్తికేయ ట్వీట్ కు లావణ్య సమాధానంగా.. సో స్వీట్ థ్యాంక్యూ కార్తికేయ. నాకు కూడా ఈ నీతో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నీవు కుమ్మేయడం ఖాయం అన్నట్లుగా ట్వీట్ చేసింది.

కార్తికేయ ట్వీట్ ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటుంది. లావణ్య త్రిపాఠి ఒక ఫ్లాప్ హీరోయిన్. ఆమె ఆఫర్ల కోసం కిందా మీదా పడుతుంది. ఇలాంటి సమయంలో నీ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె అదృష్టం. అలాంటిది ఆమెతో నటించడం గొప్ప అచీవ్ మెంట్ అని నీవు ఎలా అనుకుంటావు. సమంత.. పూజా హెగ్డే.. శ్రద్దా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటించడంను అచీవ్ మెంట్ గా పెట్టుకుని వారితో నటించినప్పుడు గొప్ప అచీవ్ మెంట్ గా చెప్పుకో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer